పేజీలు

29, ఏప్రిల్ 2010, గురువారం

శ్వాస ధాత్రి


నిన్న టీవి వార్తలు చూస్తుంటే అందులో ఒక మంచి వార్త!
కొంత మంది ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఒక పరికరాన్ని కనిపెట్టారు. దాని పేరు 'శ్వాస ధాత్రి' . బోరుబావుల్లో పడిప్రాణాలు కోల్పోతున్న పిల్లలను సురక్షితంగా బయటకు తీయడానికి ఉపయోగపడే పరికరం. కనీసం బయటకు తీసేంతవరకైనా పిల్లల ప్రాణాలను నిలిపే పరికరం. వారిలో భయాన్ని, ఆందోళనని తొలగించే పరికరం. నీకేం కాలేదు, మేమంతా నీతోనే ఉన్నాం అని ఆ లేత మనసుకు ధైర్యం చెప్పడానికి పనికి వచ్చే పరికరం. ఇంకా ఎన్ని ప్రయోజనాలుఉన్నాయో, అసలు ప్రయోగదశను దాటి క్షేత్ర స్థాయికి వచ్చాక ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తుందో తెలీదు కాని ఇక్కడసంతోషకరమైన విషయం ఏంటంటే ఆ విద్యార్థులు చేసిన ప్రయత్నం, వారి ఆలోచించిన విధానం, లోకం తెలియనివయసులో నానా హింసను అనుభవించి సమాజ నిర్లక్ష్యానికి ఘోరంగా బలయిపోతున్న పసివాళ్ళ కోసం ఏదన్నాచేయాలన్న తపన వారిలో కలగడం. వాళ్ళు కూడా నిన్నా మొన్నటి పసివాళ్ళే. అయినా ఎంత పెద్ద ఆలోచన! సమాజంపట్ల ఎంతటి బాద్యత!
ప్రజాసేవ కోసమే మేమున్నామనే రాజకీయ పెద్దలు, ప్రజల రక్షణకే మేము పని చేస్తున్నామనే రక్షక భటులు, రేపటిపౌరుల మీద ఎక్కడలేని బాద్యతను నెత్తిన ఏసుకుని 'ఆట'ను ఆపమని గగ్గోలు పెట్టె సామాజిక సంస్కర్తలు... వీరెవరికీకలగని స్పందన ఆ విద్యార్థులలో కలగడం హర్షణీయం. ఇదిగో వీళ్ళే.. ఇలాంటి విద్యార్థులే రేపటి సమాజాన్ని నడపబోయేసైనికులు అన్న ఆలోచన రేపటి ఉత్తమ సమాజం పై నాకు ఆసను కలిగిస్తుంది. ఏమో! ఈలోపు ఏ రాజకీయ శక్తి వారినితమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటుందో!..ఏ సిద్ధాంతాలు వారిని పక్కదారి పట్టిస్తాయో !.. ఏ ప్రాంతీయ తత్త్వం, ఏకుల తత్త్వం, ఏ మత తత్త్వం వారిని స్వార్థ పరులుగా మారుస్తుందోనని భయం కూడా ఉంది మరో ప్రక్క. ఏది ఏమైనా వారిప్రయత్నాన్ని హర్షిద్దాం. బ్లాగర్లు అందరూ ఈ విషయంపై మీవంతుగా స్పందించండి.

28, ఏప్రిల్ 2010, బుధవారం

మీడియా మానియా ..పాపం సానియా !

కొన్నాళ్ళ క్రితం ఇదే బ్లాగులో 'ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి' అన్న శీర్షికతో సానియా పెళ్లి విషయంలో మీడియాచూపిస్తున్న అత్యుత్సాహం గురించి రాసాను. పిలవని పేరంటానికి వెళ్లి అవమానాల పాలైనా, సానియా ఇంటి చూరుపట్టుకుని వేలాడి మరీ పెళ్లి ఘట్టాలను క్షణ క్షణం కళ్ళకు కట్టింది మీడియా . మొదట్లో అయాచితంగా వచ్చిన పబ్లిసిటీనికాదనలేక పోయినా కొత్త దంపతులను కాపురం కూడా చేసుకోనివ్వకుండా మీడియా తరుముతుంటే పాపం సానియా జంటఇకనైనా మా మానాన మమ్మల్ని వదలన్డంటూ బతిమిలాడుకోవలసి వచ్చింది. చెప్పించుకునేదాక రావడం అన్నది సిగ్గుపడాల్సిన విషయం కదా. దీన్నే 'అతి' అంటారేమో?

భూమిక

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

ఈ వ్యవస్థలో కులమూ ఒక ఆయుధమే !

అసలు కులం అన్న భావననే రూపుమాపాలని సభ్య సమాజం భావిస్తోంటే సిగ్గులేని, నీతిలేని రాజకీయాలు కులభావనని స్వార్థ ప్రయోజనాల కోసం పెంచి పోషిస్తున్నాయి. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా, వ్యభిచారం చేస్తూ కెమెరాలకు దొరికినా, అక్రమాలు చేసినా , ఆక్రమణలు చేసినా '. పలానా కులం వాడిని కాబట్టి నామీద కుట్ర చేస్తున్నారు. ఇది అగ్రవర్ణాల అహంకారం.' అని సిగ్గు లేకుండా తప్పును కప్పి పుచ్చుకునేందుకు, దృష్టినిమళ్ళించేందుకు కులాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. రిజర్వేషన్లు గాని, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రాధాన్యత గానిఆయా కులాల్లో ఉన్న పేదలను ఉన్నత స్థితికి తీసుకురాడానికి ఉద్దేశించినవి. అంతే కాని కులపిచ్చిని రెచ్చగొట్టడానికికాదు. కులాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలు చేయడానికి కాదు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నూకారపు సూర్య ప్రకాశ రావు అనే ఆయనపై కొన్నేళ్ళ క్రితం భూ ఆక్రమణలఆరోపణలు వచ్చాయి. వాటినుంచి బయట పడేందుకు కుల ప్రస్తావన తెచ్చి హంగామా చేసాడు. ఆరోపణలలో నిజంఎంత ఉందో తెలీదు కాని , ఆయనకు మాత్రం ప్రెస్ కు ఎంత పవరు ఉందో బాగా అర్థమైంది . అందుకే ఒక పత్రిక పెట్టేసి తనేఇతరుల అక్రమాల గురించి రాయడం మొదలు పెట్టాడు. అయితే ఇప్పుడు అతని మీద వచ్చిన ఆరోపణలు ఏంటంటే , పత్రికను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిలింగుకు పాల్పడ్డాడని. జర్నలిజం నైతిక విలువలని మంటకలిపాడని. ఆరోపణలని అతను న్యాయపరంగా ఎదుర్కోవచ్చు. తన చేతిలోనే పత్రిక ఉంది కాబట్టి అవన్నీ అభూత కల్పనలని సాక్షిపత్రిక తరహాలో వినూత్న కథనాలు రాసుకోవచ్చు. పత్రికలూ కూడా స్వప్రయోజనాలకే అన్న విషయం జనానికి ఎప్పుడోతెలిసింది. ఎవరు ఏం రాసుకున్నా వాళ్ళు అడగరు. ఇవన్నీ కాకుండా కుల ప్రస్తావన ఎందుకు స్వామీ? నీతి అన్నదిమనిషిని బట్టి ఉంటుంది కాని కులాన్ని బట్టి కాదని పత్రికాధిపతులు తమకు తెలియదా? రాధా కృష్నది అహంకారమేఅనుకుందాం. అతనూ పత్రికను అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదించాడనే అనుకుందాం. నువ్వు చేసింది అక్రమం అంటేఏం నువ్వు చెయ్యలేదా' అని అసెంబ్లీలోనే కాట్లాడు కున్న వ్యవస్థ మనది. న్యూస్ ఛానెలు పెట్టి ఒకడు, పత్రిక పెట్టి ఒకడు,పార్టీ పెట్టి ఒకడు, ఆశ్రమం పెట్టి ఒకడు ..ఇలా అందరూ అక్రమంగా సంపాదించుకోండి. మనది ప్రజాస్వామ్యం మరి. అందుకని మేమేమీ అడగం. కానీ కులాల వాదం తీసుకురాకండి. దండం పెడతాం.
'

20, ఏప్రిల్ 2010, మంగళవారం

గుర్తుకొస్తున్నావు!

గుర్తుకొస్తున్నావు.
బాగా గుర్తుకొస్తున్నావు.
నిన్ను మర్చిపోవాలనుకున్న కొద్దీ గుర్తుకు వస్తున్నావు.
అసలు గుర్తుకు రావడం ఏంటి? మర్చిపోతేనే కదా గుర్తుకు రావడం అనేది ఉంటుంది. ఇది గుర్తుకు రావడం కాదు. మర్చిపోలేక పోవడం.
'అసలు నన్నెందుకు మర్చిపోవాలి?' అని నువ్వు నన్ను అడిగితే బాగుండు అనిపిస్తుంది. 'నన్ను ప్రేమిస్తున్నావా?' అనిఅడిగితే బాగుండు అనిపిస్తుంది. నువ్వేదీ అడగవు. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు. నీ కోసం నా మనసు పడే బాధ నీకుఅర్థం కాక కాదు. అక్కర లేక. అందుకే విలవిల లాడుతున్న నన్ను చూస్తూ కూర్చుంటావు తప్ప ఏమైందని అడగవు. నేనూ చెప్పను. ఇది అహంకారం కాదు. నీ మీద ప్రేమే. నీకు అక్కరలేని వాటిని నిన్ను బతిమిలాడో, కన్వీన్స్ చేసో నీకుఎందుకు అంటగట్టాలి? నేనేమి సేల్స్ మాన్ని కాదు. ప్రేమికుడిని. నా ప్రేమ నీకు విలువైనదిగా అనిపించాలి. అరుదైనవరంలా అనిపించాలి. నీకు కావాలనిపించే అర్హతలు నేను పొందాలి. అపుడు నువ్వే అడుగుతావు. 'నన్నుప్రేమిస్తున్నావా?' అని.
అవన్నీ జరగాలంటే ముందు నిన్ను మర్చి పోవాలి. అందుకే ప్రయత్నం. నీకు తెలుసా? ఎవరో ఒక అనుభవశాలి ఇలాచెప్పాడు "సంతోషం అయినా ప్రేమ అయినా - మనం వాటి వెనకాల పరుగేత్తినంత కాలం దొరకవు. మనం ఆదమరపుగా ఉన్నపుడు సీతాకోక చిలుకలా మన భుజం మీదికి వచ్చి వాలతాయి.''
అందుకే నిన్ను నా మనసు దరి దాపుల్లోకి రానివ్వకూడదని అనుకుంటున్నాను. అయినా వదలవుగా నువ్వు. నీముఖంలోకి చూస్తే నన్ను నేను మర్చిపోతాననే భయం. అందుకే నువ్వు నాకు ఎదురు పడకూడదు అనుకుంటాను. నీమాట వింటే మంత్రంలా నా మనసును కట్టిపడేస్తుందని భయం. నీకు దూరంగా ఉంటేనే నీ మాయ లోంచి నాకు విముక్తి. అందుకే దూరం ఇల్లాగే ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు దగ్గరవ్వాలని అనుకునేదాకా దూరంకొనసాగాలి. నా ప్రేమ సీతాకోక చిలుకవు నువ్వు. నీ అంతట నువ్వే నా మనసు తోటలోకి వచ్చి వాలాలి. అప్పటికి దాకానీ లోకంలో నువ్వు హాయిగా, స్వేచ్చగా ఉండు. నీ సుఖాన్ని కోరుకోవడం కంటే ప్రేమకు పరమార్థం ఏముంది చెప్పు! నీకోసం తపించడంలో నాకు ఆనందం ఉంది. నీకోసం కలవరించడంలో నాకు మనశ్శాంతి ఉంది. నిన్ను ప్రేమిస్తూ ఉండటం నాకు ఎంతో అదృష్టంగా అనిపిస్తుంది. అసలు నిన్ను కలవడం అన్నది నేను గర్విస్తోన్న విషయం. చూసావా! ఇలా రాస్తూ రాస్తూ మళ్ళీ నీ మాయలో పడి ఎక్కడికో వెళ్లిపోతున్నా. ఇదే ప్రేమ మహిమ. కాదు నీ మహిమ. నువ్వు కలవక పోతే అసలు నాలో ఈ ప్రేమ ఎలా పుట్టేది?

19, ఏప్రిల్ 2010, సోమవారం

ప్రేమ - ఆక్సిజన్

మనందరికీ తెలుసు - మనం గాలి పీల్చుకుని బ్రతుకుతున్నామని. మనలో చాలా మందికి తెలుసు - మన ప్రాణాధారం ఆక్సిజన్ అని, కొన్ని క్షణాలు అది అందక పోతే ప్రాణం నిలువదని. కాని రోజుకు ఎన్నిసార్లు మనం ఆక్సిజన్ గురించిమాట్లాడుకుంటాం? ఎన్నిసార్లు దానికి కృతజ్ఞతలు చెప్పాం? ఎంతగా దానికి గుర్తింపునిస్తున్నాం? డబ్బు గురించి కలవరించినంతగా ఆక్సిజన్ గురించి తలచుకుంటామా? అలా అని ఆక్సిజన్ అనేది లేదనిగాని, దాని అవసరం లేదనిగాని ఎవరైనా అనగలరా?
ప్రేమ కూడా అలాంటిదే. మనసుకు ఆక్సిజన్ లాంటిది. జీవితానికి వెలుగు లాంటిది. తెలిసో తెలీకో దాని ఆధారంగానే మనందరం బ్రతుకుతున్నాం. కాకపోతే దాని ప్రాధాన్యతని గుర్తించడం లేదు అంతే. జీవితంలో ప్రతిక్షణం అవసరమైన ప్రేమను కేవలం టీనేజి వయసుకే పరిమితం చేసి ఆ వయసులో ఉండే ఆకర్షననే ప్రేమ అంటున్నాం. దాని ఆధారంగానే సినిమాలు తీసేస్తున్నాం. ఇంతేనా ప్రేమ గురించి మనం తెలుసుకుంది? జీవితంలో ఏ వయసులో అయినా ప్రేమ గురించి మాట్లాడుకోవచ్చని , ప్రేమకు లోనవడంలో తప్పు లేదని, అది సహజం అనీ ఎంద్కుకు తెలుసుకోం? తీరిక లేకా? తెలీకా?

ప్రేమ ప్రాధాన్యత తెలుసుకుంటే తెలియని ఒంటరితనంతో..ఏదో లోటుతో.. నిస్సారంగా, బ్రతుకును యంత్రంలా నెట్టుకొస్తూ.. తనలో తాను తెలియని అసంతృప్తితో రగిలిపోతూ... మనసులో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసుకునేందుకు ప్రయత్నించే ఒక ఇల్లాలిని అర్థం చేసుకోవచ్చు కదా. టీనేజి వయసులో పక్క దారులు తొక్కే పిల్లల్ని అర్థం చేసుకోవచ్చుకదా. మలివయసులో ప్రాధాన్యతను కోల్పోయి, నిరాదరణకు గురయిన పెద్దవాళ్ళను అర్థం చేసుకోవచ్చు కదా.

ప్రేమ గురించి తెలుసుకుందాం. ప్రేమ గురించి ఆలోచిద్దాం. మన జీవితంలో ప్రేమ ఎక్కడుందో, ఏస్థాయిలో ఉందో తెలుసుకుందాం. ప్రేమను ఇద్దాం. ప్రేమను తీసుకుందాం.

12, ఏప్రిల్ 2010, సోమవారం

ఎన్టీయార్


సల్మహయేక్

ప్రియమణి

కరీనా కపూర్

అమీషా పాటిల్

సల్మహయేక్

తమన్నా

సల్మహయేక్


6, ఏప్రిల్ 2010, మంగళవారం

ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి!


అనగనగా ఒక సానియా. పెద్ద అందగత్తె ఏమీ కాదు. కాకపోతే ఆ పదహారు ప్రాయాన సహజంగా ఉండే ఆకర్షణ కూసిన్త ఉండింది. పైగా ఆ పిల్ల ఆడే ఆట అలాంటిది. దాంతో అందం కంటే గ్లామర్కి పిచ్చెక్కి పోయే కుర్రాళ్ళకి సానియా ఒక మానియా అయిపోయింది. మానియా ఎక్కడ ఉంటె అక్కడ, అతి చేయడానికి మీడియా ఉండనే ఉంది. ఆట ఏమాత్రంఆడిందో , ఒక షరపోవ కంటే ఏమంత గొప్పదో, ఒక కోనేరు హంపి కన్నా ఎంత టాలెంట్ ఉన్న క్రీడాకారినో మీడియానేచెప్పాలి. దీంతో ఆవిడ అటు ఆట తోనూ , ఇటు ప్రకటనల తోను పిచ్చ పిచ్చగా సంపాదించింది.

అది చాలదన్నట్టు... ఆవిడ మైనారిటీ వర్గానికి చెందినది కావడంతో, ఆ వర్గానికి ఎక్కడ లేని 'చేయి ' ఊత మిచ్చేప్రభుత్వం ఐ మీన్ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు రెండూ అదే పార్టీవి కావడంతో వద్దన్నా తీసుకోమంటూ ప్రోత్సాహకాలను తెగఇచ్చి పడేశాయి. ఇంటి స్థలం దగ్గరనుంచి పద్మశ్రీ వరకు దారాదత్తం చేసాయి. అందగత్తెలనగానే ఇటు సమాజం ఎంతఉదారత్వం చూపిస్తుందో , అటు రాజకీయ నాయకులు కూడా అంత ఉదారత్వం చూపిస్తారు. పాపం వారు కూడాసమాజంలో మనుషులే కదా! పైగా జేబులోంచి పైసా కూడా తీయనక్కర లేదాయే. ప్రజల సొమ్ము అప్పనంగా ఎవరికైనాఒప్ప చెప్పే అధికారం వాళ్లకు ఉంది. ఆ రకంగా పల్లికిలించుకుంటూ అందరూ కలిసి ఆ పిల్లని ఆకాశానికి ఎత్తేసారు.ఎంతగా ఎత్తేసారంటే .. ఆ పిల్ల ఆడటం కూడా మర్చిపోయింది. పాపం!

అదంతా గతం. ఇప్పుడు ఆవిడ ఒక విదేశీయుడిని పెళ్లి చేసుకుని వెళ్లి పోతానని, మరో దేశంలో కాపురం పెడతాననిచెపుతోంది. మామూలుగా అయితే ఒక ఆడపిల్లగా ఆవిడ అభిప్రాయాన్ని , ఇష్టా ఇష్టాలను ఎవరూ కాదనరు. కాని ఇన్నిప్రయోజనాలు, ఇంత గౌరవం ఈ దేశం నుండి పొందాక ఒక సెలెబ్రిటీ గా తను చాలా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. షోయబ్ ను పెళ్లి చేసుకోవడం ఎవరూ కాదనరు. అతన్నే వచ్చి ఇక్కడ ఇల్లరికం ఉండమన వచ్చుగా అని మాత్రంఆలోచిస్తారు. ఏది ఏమైనా సానియా నిర్ణయం..ఆమెను అతిగా గారాబం చేసిన మన వాళ్ళను చెంప చెల్లుమనిపించేలాఉంది. దిలీప్ కుమార్ లాంటి కళాకారులను చూసి సానియా నేర్చుకోవాలి.

ఇదంతా ఒక తంతయితే ప్రతి రోజూ ఆవిడ పెళ్లి వార్తలని పతాక శీర్షికగా పెట్టుకుని మీడియా చేస్తోన్న హడావిడిపుండుమీద కారం చల్లినట్టుగా ఉంది. వాళ్ళ వ్యక్తిగత గొడవని రాష్ట్రీయ, జాతీయ సమస్య కంటే ఎక్కువ అన్నట్టు చిత్రీకరించి చెపుతున్నారు. పేదరికం వల్ల మధ్యలోనే చదువును ఆపేసి కూలీలుగా మారిన వాళ్ళ గురించి ఇంత పబ్లిసిటీఎప్పుడైనా చేసారా. చేయరు. ఎందుకంటే ఆ వార్తలో మానవత్వం, సమాజ , ప్రభుత్వ బాధ్యతలు గురించి గుచ్చి చెప్పడంతప్ప గ్లామర్ లేదుగా.
అందుకే నాకీ జాతీయం గుర్తొచ్చింది ''ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి''

3, ఏప్రిల్ 2010, శనివారం

త్రిష


ఐశ్వర్యారాయ్

త్రిష


శ్రియ