పేజీలు

25, నవంబర్ 2010, గురువారం

కూలి నెంబర్ వన్

అది హైదరాబాదు లోని బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక బడాబాబు ఇల్లు.
'' అమ్మాయినే చేసుకుంటానంటే నీకు ఆస్తిలో నయాపైసా కూడా ఇవ్వను!'' గద్దించాడు బడాబాబు.
''మరేం పరవాలేదు! నాకు ప్రేమ దొరికితే చాలు. అదే తింటాను. అదే తాగుతాను. అదే పీలుస్తాను. '' నిన్నే గర్ల్ ఫ్రండుతోఐమాక్స్ థియేటర్ లో చూసిన యూత్ సినిమాలోని డైలాగును ఉద్వేగంగా చెప్పాడు దొరబాబు.
''ఒరేయ్! డబ్బులో పుట్టి డబ్బులో పెరిగినోడివి. ఖర్చు పెట్టడం తప్ప సంపాదించడం చాతకానోడివి. డబ్బు లేకుండా ఎలాబ్రతుకుతావురా?" బెదిరించే ప్రయత్నం చేసాడు బడాబాబు.
"నన్నేం బెదిరించక్కర లేదు. కూలి పని చేసుకు బ్రతుకుత."
"పిచ్చోడా! కూలి పని చేస్తావా? హ్హ హ్హా ! "
"ఎందుకంత ఎగతాళి? కావాలంటే కూలిపని చేసి రేపు ఈపాటికి పది లక్షలతో ఇంటికి వస్తా. నేనేంటో నిరూపిస్తా !"
ఆవేశంగా బయటకు వెళ్ళాడు దొరబాబు. కూలీ అన్న మాట వినను కూడా వినని కొడుకు చాలెంజి ఎలాచేసాడబ్బా...అని బుర్ర గోక్కుంటున్న బడాబాబు దృష్టి టేబుల్ పైన ఉన్న వార్తా పత్రిక పైన పడింది. 'కూలి చేసిపద్నాలుగు లక్షలు సంపాదించిన కేసీఆర్ .' అన్న హెడ్డింగు చూసి నవ్వుకున్నాడు బడాబాబు.
*******
అదే హెడ్డింగు చూసి ఇంకొకడు కూడా నవ్వుకున్నాడు. వాడెవడో కాదు! తరతరాల నుంచీ కూలీ బతుకీడుస్తూ ఈనాటికికూడా పూట గడవని స్థితిలో ఉన్న నిజమైన కూలీ.

4, నవంబర్ 2010, గురువారం

దీపావళి శుభాకాంక్షలు !

కాలుష్య రహిత దీపావళిని , కల్మషం లేని మనసుతో , కల్తీ లేని ఆనందంతో కాంతి భరితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ... మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

కాలుష్య రహిత దీపావళి - మామూలు రోజుల్లోనే వాతావరణ కాలుష్యం ఎక్కువ. ఇక దీపావళికి అది రెండు వందల శాతం ఎక్కువ కలుషితం అవుతుందని అంచనా. అందుకని టపాసులను ఎక్కువగా కాల్చకండి. వాయు కాలుష్యాన్ని పెంచాకండి. ఇక మామూలుగా మన చెవులకు అరవై దేసిబుల్స్ స్థాయి శబ్దాలు మాత్రమే అనుకూలం. అంతకు మించి స్థాయి గల శబ్దాలు రక్త పోటును పెంచి గుండెపోటుకు కారణం అవుతాయి. అందుకని పెద్దగా శబ్దం చేయని టపాసులను కాల్చండి.

కల్మషం లేని మనసు - టపాసులు కాలుస్తా .....చాలామంది డబ్బులు కాలిపోతున్నాయి అని భాధ పడుతూ ఉంటారు. కాని తప్పదు. పిల్లలు ఊరుకోరు కదా. దానికి మించి పొరుగువాడు కాలుస్తుంటే మనం కాల్చకపోవడం అనేది శ్రీమతికి నామోషి. అందుకని డబ్బులు తగలెయ్యడం అంటే టపాసులను కాల్చడం తప్పట్లేదని అనుకుంటూ బాధపడుతుంటారు. కాని ఒక్కసారి మీ పిల్లల ముఖాల్లోకి చూడండి. ఆ ఆనదాన్ని ఎంత డబ్బు పెట్టి కొనగలరు? దానితో పోలిస్తే మీరు తపసులకు తగలేసేది తక్కువే. కాబట్టి సంతషంగా పండుగ చేసుకోండి.
దీపావళి శుభాకాంక్షలతో ...