పేజీలు

25, ఫిబ్రవరి 2010, గురువారం

అనుష్క

విచ్చత్తి అంటే 'అలంకారానికి తగిన చక్కదనం' అని అర్ధం. ఈ 'విచ్చత్తి ' అనేది గాత్రజానుభావం. అనుభావం అంటే ప్రభావం , భావం, స్థితి అని అర్థాలున్నాయి. ఈ అనుభావాల గురించి 'రసభావనాయక సాంప్రదాయం' అన్న పుస్తకంలో విపులంగా ఉంటుంది. ఆ గ్రంధాన్ని 1911lo శ్రీ నాగ భూషణ కవి వ్రాసారు.


స్నేహ


ఐశ్వర్యా రాయ్


18, ఫిబ్రవరి 2010, గురువారం

ప్రేమ - ఒక అద్భుత శక్తి

కొన్నేళ్ళ క్రిందట నా జీవితంలో నా అనుభవానికి వచ్చిన సంఘటన !
నేనామెను ప్రేమించాను. కాని ఆ విషయం ఆమెతో చెప్పలేను. కారణం మా స్నేహం చెడిపోతుందేమోనన్న bహయం. 'నిన్ను ప్రేమించాను' అని చెప్పడం ఈ సమాజంలో నేరం ఎందుకు అవుతుందో , అందుకు భయమెందుకో నాకు ఇప్పటికి తెలీలేదు. అది అత్యంత సహజమని ఎందుకు అనుకోరో ! ప్రేమ పేరుతో జరిగే ఇన్ని అనర్థాలకు మూలం ప్రేమ అంటేనే తప్పు అన్న భావన అని నా అభిప్రాయం.

నా అభిప్రాయాలేలా ఉన్నా ప్రేమన్నది ఇద్దరి ఇష్టాలకు, అభిరుచులకు , అభిప్రాయాలకు సంబంధించిన విషయం కాబట్టి , అవతలి వారి ఫీలింగ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే కాబట్టి నా ప్రేమ విషయం తనకు అప్పటికి చెప్పలేదు. ఇలాంటి సందర్భంలో ప్రేమన్నది కాలం పరిష్కరించేదాక వ్యక్తిగత బాధగా మిగిలి ఉంటుంది. లోలోన లావాలా మనసును దహించివేస్తూ ఉంటుంది.

ఆ సమయంలో ఒక రోజు... శ్రీరామ నవమి .

ఆఫీసుకు సెలవిచ్చారు. నేను మాత్రం పని వుండి ఆ రోజు ఆఫీసుకు వచ్చాను. అంతకు ముందు రోజు తను ఆఫీసుకు రాలేదు. అంటే తనను చూసి అప్పటికే ముప్పయి ఆరు గంటలు అయి పోయింది. ప్రేమ ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఎడబాటు ఎంత బాధగా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ రోజు తనని చూడాలని చాలా గాడంగా మనసు కోరుతోంది. కాని ఎలా? తన ఇల్లు ఎక్కడో తెలిసినా వెళ్ళలేను. తను ఆఫీసుకు వచ్చే చాన్స్ లేదు . మరెలా? తనను చూడాలి . ఈరోజే చూడాలి. చూడలేనా? నా ప్రేమకు అంత శక్తి లేదా? తనను నాకు ఎలాగైనా చూపించలేదా? యస్ ! నేను చూడగలను. ఇది నా ప్రేమకు పరీక్ష అనుకున్నాను.

బిల్డింగ్ పైకి వెళ్లాను. తన ఇల్లు ఉన్న వైపుకు తిరిగి మనసులో గట్టిగా 'తనని చూడాలి ' అనుకున్నాను. మళ్లీ మళ్ళీ అనుకున్నాను. కిందికి వచ్చాను. నా కొలీగ్ సినిమాకు వెళ్దామా అన్నాడు. ఆశ్చర్య పోయాను. ఎందుకంటే అంత క్రితం నేను అడిగితే తను రానన్నాడు. ఇంతలో అతని మనసెలా మారిందో తెలీదు.

అక్కడ తన ఇంట్లో...

వాళ్ళ అన్నయ్య సినిమాకు వెళ్దామా అని ఆమెను కొద్దిసేపటి క్రితం అడిగాడు. ఆమె రానని చెప్పింది. అతను తన ఫ్రండ్ దగ్గరికి బయలుదేర పోతుంటే ఆమె వెళ్లి సినిమాకు వెల్దామంది. కాని అప్పటికి సమయం దాటి పోయింది. అయినా వెళ్దామని పట్టుబట్టింది.

ఇక్కడ నా ఫ్రండ్ కూడా పట్టు పట్టాడు. బయలుదేరాం. అప్పుడే నాకనిపించింది. ఈరోజు తనని నేను చూడబోతున్నానని. స్కయ్లేన్ థియేటర్ లో ఒక పాత ఇంగ్లీష్ సినిమాకు వెళ్ళాం . టిక్కట్లు అయిపోయాయి. తిరిగి వచ్చేస్తోంటే ఒకతను వచ్చి రెండు టిక్కట్లు ఉన్నాయి కావాలా అని అడిగాడు. అప్పటికే సినిమా మొదలయ్యి చాలసేపయ్యింది. నా ఫ్రండ్ వద్దన్నాడు. కాని నేనే పట్టు పట్టి తీసుకున్నాను. ఎందుకంటే తను ఈ సినిమాకి వచ్చిందన్న సంకేతాలు నా మనసుకు అందుతున్నాయి. తను లోపలే ఉందని నా నమ్మకం. టికట్లు తీసుకుని లోపలి వెళ్లి కూర్చున్నాం. నా కళ్ళు ఆమెనే వెదుకుతున్నాయి. ఫ్రండ్ అడిగాడు ఏం చూస్తున్నావని? చెబితే నవ్వాడు. ఇంటర్వల్ లో అంతా చూసాను. ఎక్కడా ఆమె కనబడలేదు. కాని నాకు నమ్మకం. తన ఉనికి నాకు తెలుస్తోంది. అయితే ఎక్కడ?

సినిమా పూర్తయ్యింది. అందరూ లేచి వెళ్లి పోతున్నారు. నేను వెదుకుతూనే ఉన్నాను. దాదాపు హాలు మొత్తం ఖాళీ అయ్యే దశలో తను కనిపించింది. ఆరు వరసల అవతల కూర్చుంది ఆమె.

ఇదంతా చదివాక ఇదొక అద్భుతం అని అనిపించక పోవచ్చు. అనుకోకుండా జరిగిన సంఘటనలా అనిపించవచ్చు . కాని ఆ దశలో నాకది అత్భుతంలానే అనిపించింది. ప్రేమకు లేదంటే మనసుకు ఏదో దివ్య శక్తి ఉందనే అనిపించింది. టేలిపతి అంటామే ..అలాంటిది ప్రేమలో కచ్చితంగా వర్కవుట్ అవుతుందని నా నమ్మకం.

12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

స్నేహ


మల్లికా షెరావత్


శివోహం!

గృహస్తులకు రోల్ మోడల్ శివుడు!

ఒక భార్య నెత్తినెక్కి నాట్యం చేస్తోన్నా, మరో భార్య ,ఇద్దరు కొడుకులతో ఇల్లు(కైలాసం) నిత్యం సందడిగా ఉన్నా, తను మాత్రం ధ్యానముద్రలో, తపో దీక్షలో మునిగి ఉంటాడు. అంతటి ఏకాగ్రత ఆయనకెలా సాధ్యం అవుతోందో!

అదే ఏకాగ్రత మనకూ అవసరం. ఎందుకంటే పనికి పని చేసుకుంటూ, సంసారానికి సంసారం చేసుకుంటూ రెండింటా 'విజయుడు' గా నిలవాలంటే ఈ విషయంలో శివుడిని ఆదర్శంగా తీసుకోక తప్పదు మరి. ఇక్కడ మన విషయంలో పని అంటే కేవలం ఆఫీసు వర్కే కాదు, సమాజం గురించి పట్టించుకోవడం అని కూడా వస్తుంది. అయితే అంతటి ఏకాగ్రత సాధించడం అన్నది మనవాళ్ళ అయ్యే పనేనా? ఉదయం పేపరు చదివేలోపు శ్రీమతి గారు ఎన్నిసార్లు భాగం కలిగిస్తారో. పేపరు చదివెందుకే కుదరని సంసారం లోకోద్ధారణ చేయనిస్తుందా? శివోహం!

జిందగీ

కోరిక ఒకటి జనించు, తీరక ఎడద దహించు
కోరనిదేదో వచ్చు, శాంతి సుఖాలను తెచ్చు
ఏది శాపమో, ఏది వరమ్మో, తెలిసి తెలియక అలమటించుటే..
ఇంతేరా ఈ జీవితం! తిరిగే రంగుల రాట్నం.