పేజీలు

30, జనవరి 2010, శనివారం

ప్రేమ - ఒక సాహసం !

ఎంతోమంది ఎన్నో సాహసాలు చేస్తుంటారు . కొన్ని సాహసాలకు ప్రాణం పెట్టుబడి. కొన్ని సాహసాలకు జీవితం పెట్టుబడి. ప్రాణాన్ని ,జీవితాన్ని - రెంటినీ మూట కట్టి , నీ గుప్పెట్లో పెడుతూ నేను చెప్పే మాటే 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' .

ప్రేమను ఇస్తున్నాను అంటే అదేమీ వస్తువు కాదు పూవులా ఇచ్చేందుకు . ప్రేమను ఇవ్వడం అంటే సర్వాన్నీ ఇవ్వడం . ఇవ్వడం అనేది ఎప్పటికైనా సాహసమే కదా! అలా ఇవ్వగలమని నమ్మకం ఏర్పడినప్పుడే ఎవరైనా ఎవరినైనా ప్రేమిస్తున్నాని చెప్పగలరు. స్వార్ధపరులు , పిరికివాళ్ళు, ఇతరుల కోసం బ్రతకలేని కుంచిత మనస్కులు ప్రేమిస్తున్నానని చెప్పలేరు .
ప్రేమను ఇవ్వడం అంటే కేవలం ఇవ్వడమే. ఇందులో తిరిగి తీసుకోవాలనడం కానీ, ఏదో ఆశించడం కాని ఉండదు. ప్రతిఫలం ఆశిస్తే ఇవ్వడంలో అర్థం ఏముంది? ఏదీ ఆశించకండా ఇవ్వడం అన్నది ఎంత సాహసం కదా! అందుకే ప్రేమ - ఒక సాహసం. ఏ ప్రేమలోనూ రెండు వైపుల నుంచీ ఇవ్వడం అనేది ఉండదు.

తీరా ఇంత సాహసంతో ఇస్తానన్నాక అవతలి వారు అక్కరలేదంటే ..?

దాని గురించి నీకెందుకు? ఇవ్వడానికి సిద్ధపడటమే నీ వంతు. తీసుకోవడం , తీసుకోకపోవడం అవతలివారి ఇష్టం. వారికున్నఅవసరం. అంతే! దాంతో నీకు నిమిత్తం లేదు. చాలా కష్టమైన పని కదా. అందుకే అంటున్నా! ప్రేమ - ఒక సాహసం!

28, జనవరి 2010, గురువారం

భానుమతి రామకృష్ణ


లతా మంగేష్కర్


ఎం.ఎస్ . సుబ్బులక్ష్మి


చెరిగి పోతున్న స్మృతులు


ఉమ్మడి కుటుంబపు పరువు, బరువులను బాధ్యతగా మోసే ఒక పెద్దన్న, మానవత్వం మూర్తీభవించిన ఒక జమిందారు, ప్రేమను అంగీకరించలేని ఒక తండ్రి , ఎన్ని కష్టాలు వచ్చినా కట్టుబాటు దాటని ఒక సాంప్రదాయ వాది...
ఇతిహాసాలలో... ధర్మరాజు, విశ్వామిత్రుడు, వసిష్టుడు, భ్రుగు మహర్షి, దూర్వాసుడు , పరశురాముడు, భీష్ముడు..

చరిత్రకు... తిమ్మరుసు, పోతన.... ఇలా ఎన్నో పాత్రలు ...

పంచెకట్టు, భుజాన కండువ, చేతిలో ఊతకర్ర , తీరైన మీసపు కట్టు , పొడుగాటి ముక్కు ... మొత్తంగా ఆప్యాయత మూర్తీభవించిన రూపం, గౌరవిన్చాలనిపించే పెద్దరికపు లక్షణాలు... ఇది వేషధారణ.

ఇక మాట ..ప్రతి తెలుగు వాడూ వింటూనే గుర్తుపట్టగల కంటస్వరం .
నిన్నటి దాక అది కనీసం గతంగానైన ఉండేది. ఇప్పుడు ఏకంగా మాయమైంది. ఆనాటి చిత్రాలు, మరువలేని పాత్రలు, మహా నటులు...ఇదంతా గతమే. అయితే ఆ గత వైభవ చిహ్నాలుగా నాటి నటులు ఎప్పుడైనా కంటి ముందు కదలాడితే మనసుకు ఆనందంగా ఉండేది. కాని ఒక్కొక్కరుగా వారంతా మాయమై పోతోంటే ఏదో వైరాగ్యం ఆవరిస్తూంది.
నాడు కళాకారులకు హద్దులు లేవు . మాయాబజార్ సినిమాకు పనిచేసిన కెమరమన్ మన తెలుగు వాడు కాదు . మన ఇతిహాసాలను నమ్మిన వాడూ కాదు. ఒక కళాకారుడిగా అతను పనిచేసాడు .అతని కళను మనమందరం హర్షించాం . అది ఆనాటి సంస్కృతి . ఇక ఈనాటి సంస్కృతిని మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఆ తరం మనల్ని వదిలి పోతోంటే ఒక రకమైన గుబులు. దిగులు .

గుమ్మడి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ..

18, జనవరి 2010, సోమవారం

8, జనవరి 2010, శుక్రవారం

అమీషా పాటిల్


భూమికా చావ్లా


హన్సికా మోత్వాని


5, జనవరి 2010, మంగళవారం

పరోక్ష హింస మొదలయ్యింది !

ఈరోజు ఆంధ్ర జ్యోతి దినపత్రికలో సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాసిన తెలంగాణా రచయితల వేదిక వారికి,

'విభజనతో సమైఖ్య భావన' అని రాసిన వరవరరావు గారికి ,

ఇతర తెలంగాణా వాదులకు,

అయ్యా,

ఈ క్రింద ఉదహరించిన సంఘటనలకు ఎవరు సమాధానం చెప్తారు?

కొబ్బరిబోండాం దుకాణం..

అమ్ముతున్నది ఒక ఆడ మనిషి . ఒకతను వచ్చి ఎంత అన్నాడు? ఒకటి పది రూపాయలు అంది. వాళ్ళ సంభాషణలని బట్టి ఆమె ఆంధ్ర , అతను తెలంగాణా అని తెల్సింది. ఒక బొండాం అక్కడే తాగేసి మరొకటి పార్సెల్ తీసుకున్నాడు. పదిహేను రూపాయలు ఇచ్ఛి వెళ్ళబోయాడు.

'అదేంటి ఇంకా ఐదు రూపాయలియ్యి. ' అంది.

'మల్లచ్చినప్పుడు ఇస్తాలే' అని పోతానే ఉన్నాడు.

'ఆగు! అదేం కుదరదు. డబ్బులియ్యి .'

'ఏయ్ లేవ్ ఫో '

'అయితే కాయక్కడ ఎట్టు'అంది గట్టిగా .

'ఏయ్ ఏందీ సెప్పిన గంద . ఏడికి పోత?'

'నువ్వెవరో నాకు తెలీదు ముందు కాయ అక్కడ పెట్టు.'

'ఏయ్ నేనేవరనుకున్నావ్ . దుకాణం లేపెస్తా'

'ఆ ఆ చూసంలె . దుకాణం ఎమన్నా ఊరికే ఇచ్చారా. బోలెడు డబ్బులిచ్చాం.' (ఆవిడ అన్నది కిరాయి గురించి కాదు. రాజధానిలో ఎక్కడ ఎవరు ఎం చేయాలన్నా వీధి రౌడి గార్లకు డబ్బులిచ్చి వారి అనుమతి తీసుకోవాలి.)

'ఏయ్ ఏందే నకరాలు సేస్తున్నావ్ . నీ తల్లి యాదికేల్లో బతకనికి అచ్చి

'ఇదిగో మాటలు తిన్నంగా రాణి. మాకు వతాయ్ మాటలు. డబ్బులెట్టి కాయ కోనుక్కోలేదు గాని మాటాడు తున్నాడు

'నోర్ముయ్ ఆంద్ర లం... పడేసి ...'

అమ్మా సంధ్యమ్మ తల్లి ! చేతికి గాజులేసుకు కూర్చోలేదు అని మోహన్ బాబు అన్న మాటకే తరిమి కొడతాం అన్నారు . ఈ మహిళకు జరిగింది అవమానం కాదా ? లేక ఆంద్ర మహిళకు ఆత్మగౌరవం లేదంటారా?

సనత్ నగర్లో ..ఒక చోట...

ఉన్నట్టుండి ఓనరు ఇంటి అద్దె వెయ్యి పెంచాడు. అన్యాయం కదా అంటే ' మా తెలంగాణాలో అట్లే ఉంటది. ఇష్టమైతే ఉండు లేకుంటే నీ ఆంధ్రాకు ఫో?' కర్కశంగా అన్నాడు.

మరోచోట తన ఇంట్లో అద్దెకు ఉన్న ఆంద్ర వాళ్ళని మాత్రమే ఖాళీ చేయించాడు ఇంటాయన.

మరో ఘటన !.....

మా ఆటో అతను చాలా మంచివాడు. ఇదివరకు ఎప్పుడూ అతను సంస్కార హీనంగా మాట్లాడలేదు.

మొన్నొక రోజు ...

నేను ఆటో ఎక్కింది మొదలు ఆంధ్రావాల్లను దోపిడిగాళ్ళని , మోసగాళ్ళని, తరిమి తరిమి కొట్టాలని ..చాలా ఆవేశంగా మాట్లాడాడు. అతనిలో అంత ఆవేశం గత సంవత్సర కాలంలో ఎప్పుడూ చూడలేదు. అనాల్సినవన్నీ అన్నాక నన్ను అడిగాడు. మీరు ఆంధ్రోల్లా? తెలంగాణా వోల్లా? అని.

నేనేం సమాధానం చెప్పాలి? ఏ లెక్కలు ఉన్నాయి దీనికి? ముల్కి నిబంధనలా ? జే ఏ సి వాళ్ళేమైనా ప్రమాణాలు డిసైడ్ చేశారా ? నా తల్లిది తెలంగాణ . నా తండ్రిది ఉత్తరాంధ్ర . నేను పుట్టింది హైదరాబాదులో . పెరిగింది విజయవాడ. స్థిరపడింది మళ్ళీ ఇక్కడ. రాష్ట్రమంతా నాదే అనుకుని తిరిగాను. ఆ మాటకొస్తే దేశం, ఈ భూ ప్రపంచమే నాది. నన్ను ఆపే హక్కు ఎవరికుంది? ఏ తెలంగాణ వాళ్ళు విదేశాల్లో బతకడం లేదా? అలాగే నేను. ఆంద్ర వాళ్ళు.

ఎవడు ఎవడిని దోచుకున్నాడు? నీలో పోటీ పడే తత్త్వం లేక , బాగుపదాలన్న తపన లేక వెనుక పడితే అది ఎవడి తప్పు? నిన్ను చదువుకోకుండా ఎవరు ఆపారు? ఉద్యోగం చెయ్యకున్ద ఎవరు అడ్డుకున్నారు? నీ ప్రాంతం వెనుక బాటుకు నీ ప్రాంతం నుండి నీచే ఎన్నిక కాబడి యాభై ఏళ్లుగా నీ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించిన నీ ఎమ్మేల్లెలని నిలదీయి. నీ ప్రాంతం , నువ్వు వెనుకబడి ఉండగా వాళ్ళంతా కోట్లు ఎలా సంపాదించారో అడుగు. వాళ్లకు అడ్డు రాణి ఆంధ్రా వోడు నీ ఎదుగుదలకు ఎలా అడ్డయ్యాడు? అడుగు? కొడుకులను నిలదీయి? చిచ్చు పెట్టిండ్రు తమ్మీ. నీకూ నీ వాళ్ళకు మద్య చిచ్చు పెదతన్నారు.

అంత దాక ఎందుకు? మాటాడితే తెలంగాణా కావాలె అనేతోల్లంతా తెలంగాణా ఇస్తే ఏరకంగా అభివృద్ది చేస్తారో ప్రణాలికలతో ఉన్నారా?

అయ్యా !...దొరా ... హైదరాబాదులో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గం పరోక్ష హింసకు గురౌతోంది . అందుకే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి. అప్పుడే రెండు వర్గాలకు గౌరవం.