
స్నేహమా నీకు వందనం!
నాకు అల్లరి నేర్పినందుకు
నాకు నవ్వు నేర్పినందుకు
కొత్త కొత్త ఆటలు ఆడించి
నాకు మొదటి గెలుపు రుచి చూపించినందుకు
కొండలు గుట్టలు ఎక్కించి,
చెట్టూ పుట్టా తిప్పించి,
నీరూ నిప్పుతో చెలగాటమాడించి,
నాతో సాహసాలు చేయించినందుకు
ప్రమాదంతో పరిచయం చేయించినందుకు
చదువులో నాతో పోటీ పడి
నన్ను ముందుకు పరుగెత్తించినందుకు
స్వచ్చమైనదే అయినా, స్నేహంలోనూ
మంచీ చెడులు ఉన్నాయని చెప్పినందుకు
నాకు దురలవాట్లను నేర్పిన నువ్వే
నన్ను హెచ్చరించి మానిపించినందుకు
నాలో మంచినీ, చెడునీ పాలు నీళ్ళలా విడదీసి
చూపినందుకు, నా అద్దానివై నిలచినందుకు
నాకంటూ ఒక ప్రపంచం ఉందని అనిపించేలా
నా చుట్టూ నిలిచినందుకు
ప్రేమ అని నేననుకుంటే,
కాదు స్నేహం అని నా మార్గాన్ని మార్చినందుకు
ఎప్పటికప్పుడు కొత్త స్నేహానికి తావిస్తూ
నన్ను వదలి నీవు వెళ్ళినందుకు,
వెళ్తూ నీ జ్ఞాపకాలను నాకు వదలినందుకు
నేను రెండుగా విడిపోయి జీవిస్తున్నానా
అన్నంత చనువుగా నాతో తిరిగినందుకు
స్నేహమా నీకు వందనం!
నా స్నేహితులందరికీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు!
మిత్రమా !
రిప్లయితొలగించండిచక్కటి ముఖ్య విషయాన్ని చక్కగా అందించావు . అందులో సందేహం ఏ మాత్రమూ లేదు .
కొన్ని స్వల్ప మార్పులతో , అత్యున్నత స్థానాన్ని అలంకరించగలదు .
పరికించి చూడు . ఇష్టమైతే సవరించుకో . లేకుంటే లేదు .
స్నేహమా నీకు వందనం!
అల్లరి నేర్పినందుకు
నవ్వు నేర్పినందుకు
కొత్త కొత్త ఆటలు ఆడించి
మొదటి గెలుపు
రుచి చూపించినందుకు .
కొండలు గుట్టలు ఎక్కించి,
చెట్టూ పుట్టా తిప్పించి,
నీరూ నిప్పుతో చెలగాటమాడించి,
సాహసాలు చేయించినందుకు
ప్రమాదాలతో ,
పరిచయం చేయించినందుకు .
చదువులో పోటీ పడి
ముందుకు పరుగెత్తించినందుకు ,
స్వచ్చమైనదే అయినా, స్నేహంలోనూ
మంచీ చెడులు ఉన్నాయని చెప్పినందుకు ..
దురలవాట్లను నేర్పిన నువ్వే
హెచ్చరించి మానిపించినందుకు .
నాలో మంచినీ, చెడునీ
పాలు నీళ్ళలా విడదీసి
నాలో నిలువుటద్దానివై నిలచినందుకు .
నాకంటూ ఒక ప్రపంచం ఉందని అనిపించేలా
నా చుట్టూ నిలిచినందుకు .
ప్రేమ అని నేననుకుంటే
కాదు స్నేహం అని
నా మార్గాన్ని మార్చినందుకు .
ఎప్పటికప్పుడు కొత్త స్నేహాలకు తావిస్తూ
నన్ను వదలి నీవు వెళ్ళనందుకు .
నేను రెండుగా విడిపోయి జీవిస్తానేమో
అన్నంత చనువుగా నాతోనే వుంటున్నందుకు .
స్నేహమా నీకు వందనం!
నా స్నేహితులందరికీ ఈ స్నేహితుల రోజు శుభాకాంక్షలు !
శర్మ గారు! మీ సూచనలకు కృతజ్ఞతలు! స్నేహమన్నాక జీవితాంతం విడిపోకూడదనే మీ ఆకాంక్ష బాగుంది. 'ఎప్పటికప్పుడు కొత్త స్నేహాలకు తావిస్తూ
తొలగించండినన్ను వదలి నీవు వెళ్ళనందుకు.'
మంచి పోస్ట్ అభినందనలు
రిప్లయితొలగించండిఫాతిమా గారూ! కృతజ్ఞతలు!
రిప్లయితొలగించండి