పేజీలు

25, జనవరి 2011, మంగళవారం

క్యాలెండర్ అందాలు






ఒకప్పుడు దేవుళ్ళ బొమ్మలతో క్యాలెండర్లు వచ్చేవి. 'మడిసన్నాక కూసింత కళాపోసనున్డాలి ' అని ఆ తర్వాత ఎవరో చెప్పేసరికి దేవుళ్ళ స్థానే ముందు ప్రకృతి సౌందర్యం, ఆ తర్వాత స్త్రీ సౌందర్యం (అంటే కులకాన్తలు కాదు సుమా! చిత్రకారులు ప్రాణం పోసిన యవ్వనవతులు, వెండితెరపై మెరసిన అద్భుత సుందరీమనులూనూ) క్యాలెండర్ పేజీలకు ఎక్కింది. ఇక ఇప్పుడైతే క్యాలెండర్ రూపకల్పన అనేది సృజనాత్మక పరీక్షగా, స్టేటస్ సింబల్ గా, వాణిజ్య అభివృధికి తోడ్పడే ఒక అంశంగా మారింది. ఇలాంటి మార్పులు వచ్చే కొద్దీ , డబ్బు కుమ్మరింపులు ఎక్కువయ్యే కొద్దీ , మొదట్లో ముద్రించబడిన నిండారు కోక చుట్టిన ముగ్ద సౌందర్యం కాస్త నగ్న సౌందర్యంగా మారింది. క్యాలెండర్ పై ఒకప్పుడు కేవలం మోడళ్ళు మాత్రమే అందాలను ఆరబోసుకునే వారు. ఇప్పుడు తెరపై పవిత్రమైన పాత్రలలో కనిపించే భామలు సైతం డబ్బుకోసం సై అనడంతో క్యాలెండర్కు అదనపు శోభ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలు డబ్బూ రత్నాని అని ఒక ప్రఖ్యాత ఫోటో గ్రాఫర్ ౨౦౧౧ క్యాలండర్ కోసం తీసిన ప్రముఖ తారామణుల ఫోటోలు. చూసి తరిద్దాం.

5, జనవరి 2011, బుధవారం

ఏమిటీ దౌర్భాగ్యం ?

సెటిల్మెంట్ దందాలో రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి కుమారుడు!
మరో రాష్ట్రంలో ఒక వివాహిత, పవిత్రమైన ఉపాద్యాయ వృత్తి లో ఉన్న ఒక మహిళపై ఒక ఎమ్మెల్యే ఆయన అనుచరులుకలిసి మూడేళ్ళుగా అత్యాచారం చేయటం. పోలీసులకు మొరపెట్టుకున్నా ఫలితం లేని దుస్థితి.
ఎక్కడ ఉన్నాం మనం? ఏదో సినిమాలో పరుచూరి రాసిన డైలాగు గుర్తొస్తుంది.

రా- రాక్షసంగా
- జనానికి
కీ- కీడు చేసే
యం- యంత్రాంగం


ప్రతి రోజు వార్తా పత్రిక చదువుతుంటే నిజమే అనిపిస్తుంది కదూ! మన చేతిలో ఓటు ఉండీ మనం ఏమీ చెయ్యలేకపోతున్నాం అంటే మనం ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఉన్నామో తెలుస్తుంది. ఒకప్పుడు చిన్నపిల్లలకు పంచ తంత్రకథలు చెప్పాం. ఇప్పుడు రక్త చరిత్రలను చూపిస్తున్నాం. ఇక రేపటి చరిత్ర ఎలా ఉంటుందో ఊహించండి.