పేజీలు

5, జనవరి 2011, బుధవారం

ఏమిటీ దౌర్భాగ్యం ?

సెటిల్మెంట్ దందాలో రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి కుమారుడు!
మరో రాష్ట్రంలో ఒక వివాహిత, పవిత్రమైన ఉపాద్యాయ వృత్తి లో ఉన్న ఒక మహిళపై ఒక ఎమ్మెల్యే ఆయన అనుచరులుకలిసి మూడేళ్ళుగా అత్యాచారం చేయటం. పోలీసులకు మొరపెట్టుకున్నా ఫలితం లేని దుస్థితి.
ఎక్కడ ఉన్నాం మనం? ఏదో సినిమాలో పరుచూరి రాసిన డైలాగు గుర్తొస్తుంది.

రా- రాక్షసంగా
- జనానికి
కీ- కీడు చేసే
యం- యంత్రాంగం


ప్రతి రోజు వార్తా పత్రిక చదువుతుంటే నిజమే అనిపిస్తుంది కదూ! మన చేతిలో ఓటు ఉండీ మనం ఏమీ చెయ్యలేకపోతున్నాం అంటే మనం ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఉన్నామో తెలుస్తుంది. ఒకప్పుడు చిన్నపిల్లలకు పంచ తంత్రకథలు చెప్పాం. ఇప్పుడు రక్త చరిత్రలను చూపిస్తున్నాం. ఇక రేపటి చరిత్ర ఎలా ఉంటుందో ఊహించండి.

1 కామెంట్‌:

  1. అన్నిటికీ సమాధానం వోటే. దానికి వీటన్నిటినీ మార్చగల సత్తా వుంది. కానీ ఎలెక్షన్ కమీషనర్ గారు వోటెవరికేస్తారు? అనడిగేసరికి, ఇక ఫలనా వాడు సీయం కావాలనో, మా కులం వాడు పైకి రావాలనో, ఒకడిని హీరో చెయ్యడానికో, ఫలానా వాడి కొడుకో పెళ్ళామనో, డబ్బులిచ్చాడనో, వస్తువిచ్చాడనో, వేస్టైపోతుందనో లాంటి పనికిమాలిన కారణాలకని వోటేస్తాం. ఈ మొత్తంలో అసలు వోటరు బాగుకి సంబంధించి ఒక్క కారణం ఉండదు. పార్టీకి మంచి ఆదర్శాలున్నాయా? అభ్యర్ధి నిజాయితీపరుడూ, సమర్ధుడేనా? అభ్యర్ధి మంచివాడైనా పార్టీ వాణ్ణి పనిచేయనిస్తుందా? నేను కట్టే పన్ను డబ్బులు నాకోసం సరిగ్గా ఖర్చు పెట్టగలదా ఈ పార్టీ? కుల, మత, భాష, ప్రాంతాలకతీతంగా పనిచేయ్యగలదా పార్టీ? అవినీతిని చరిత్ర లేకుండా ఉందా పర్టీ? అని గనక ఆలోచించి వోటేస్తే ఇక దుస్థితులవే పోతాయి. డబ్బులిస్తున్నారంటే దోచుకు తినడానికే నని అర్ధం. కుల మత భాష ప్రాంతాలని పట్టుక్కూర్చున్న వాడు మన్నేం పట్టించుకుంటాడు? అభ్యర్ధులకన్నా పర్టీ అదర్శాలే గొప్పవి. కారణం, సమర్ధుదైన అభ్యర్ధి కూడా చెత్త పార్టీలో ఉంటే పనిచెయ్యలేడు, ఉదాహరణకి మన్మోహన్ సింగ్. మంచి ఆదర్శాలున్న పర్టీలో సాధారణ అభ్ర్యర్ధి కూడా రాణించగలడు. ఈ గ్నానం కలిగి వుంటే దుస్థితులు మాయం.

    రిప్లయితొలగించండి