పేజీలు

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

స్త్రీ కోరిక (తప్పక చదవాల్సిన కథ - ముగింపు)


(నిన్నటి బ్లాగులో ...జరిగిన కథ )

యువరాజు ప్రాణాలను కాపాడేందుకు ఒక ముదుసలి మంత్రగత్తెను వివాహం చేసుకునేందుకు సిద్ధపడతాడు యువరాజు స్నేహితుడు. అప్పుడు యువరాజు ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి అతనికి మరణశిక్షను తప్పిస్తుంది మంత్రగత్తె.

ప్రశ్న: స్త్రీ నిజంగా కోరుకునేది ?
జవాబు: తనకు సంబంధించిన ఏ విషయమైనా తన చేతుల్లోనే ఉండాలనే ప్రతి స్త్రీ కోరుకుంటుంది.

ఇచ్చినమాట ప్రకారం మంత్రగత్తెను  పెళ్ళిచేసుకున్నాడు స్నేహితుడు.

మొదటిరాత్రి...
తన స్నేహితుడి కోసం ఎదురుచూస్తోన్న ఓ భయంకర అనుభవాన్ని తలచుకుని యువరాజు లోలోన కుమిలిపోతుండగా , స్నేహితుడు మాత్రం చిరునవ్వుతో శోభనపు గదిలోకి అడుగుపెట్టాడు.

ఆశ్చర్యం!
అక్కడ పడక మీద ఓ అద్భుత సౌందర్యరాశి అతనికి స్వాగతం పలికింది. ఏమిటిదని అడిగాడు.
'నీ స్నేహితుడైన యువరాజు ప్రాణాలను కాపాడడం కోసం నువ్వు చేసిన త్యాగానికి ప్రతిఫలం... నీ భార్యగా నాకు సగం దక్కింది. అందుకే నాకీ రూపం ప్రాప్తించింది. అయితే ఈ అందం రోజులో సగకాలం మాత్రమే ఉంటుంది. మిగిలిన అర్థకాలం నేను నా అసలు రూపంతోనే ఉంటాను. ఇప్పుడు నువ్వు చెప్పు. నేనెప్పుడు ఏ రూపంతో ఉండాలి?

పగలు అందగత్తెగా  కనిపిస్తే... 
గొప్ప అందగత్తెకు భర్తగా నీకు గౌరవం ఉంటుంది. కానీ రాత్రి వేళ ఒక కురూపితో కాపురం చేయాల్సి ఉంటుంది. 
రాత్రిళ్ళు అందగత్తెగా కనిపిస్తే ...
ప్రతి రాత్రీ స్వర్గసుఖాలు అనుభవించవచ్చు. కానీ పగటిపూట ఎక్కడికి వెళ్ళినా నీ వెంట ఉండే కురూపిని చూసి అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు.నిర్ణయం నీది. నీకు ఎలా కావాలో చెప్పు.' అంది మంత్రగత్తె.

(ముగింపు... )

'ఇది నాకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. నా భార్యగా నీకు కూడా సంబంధించినది. ఏ స్త్రీ అయినా తనకు సంబంధించిన విషయాలపై తనే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటుందని నువ్వే చెప్పావు. అలాంటి సహజసిద్ధమైన స్త్రీ కోరికను నీ విషయంలో నేను తీర్చాలనుకుంటున్నాను. భర్తగా అది నా బాధ్యత కూడా. కాబట్టి ఈ విషయంలో నువ్వే నిర్ణయం తీసుకో. దానికి నేను మనస్పూర్తిగా కట్టుబడి ఉంటాను.' ఏమాత్రం తడబడకుండా  అన్నాడు.

మంత్రగత్తె మనసు ఉప్పొంగిపోయింది. 'నీ స్నేహితుడి ప్రాణాలను కాపాడడం కోసం నా లాంటి కురూపిని  పెళ్లి చేసుకోడానికి సిద్ధపడితే, అది కేవలం త్యాగమే కదా అనుకున్నాను. పెళ్లి అయిన తర్వాత నన్ను భార్యగా గౌరవిస్తావో లేదో అన్న సందేహం కలిగింది. అందుకే ఈ విధమైన ప్రశ్న నీ ముందుంచాను. భార్య రూపంతో నిమిత్తం  లేకుండా ఆమెను స్త్రీగా గౌరవించే నీ లాంటి భర్తను పొందాక నాకీ మంత్రశక్తులతో పనేముంది? నా జీవితమంతా తపించింది నీలాంటి భర్తకోసమే. అందుకే నేను అన్ని వేళల్లోనూ సౌందర్యవతి గానే, యవ్వనంతో ఉండేందుకు  నా శక్తులన్నీ ధారపోస్తున్నాను.' అన్నదామె.

(కథ సమాప్తం.)

ఈ కథ చెప్పొచ్చేదేంటంటే ...

పై రూపంతో సంబంధం లేకుండా ప్రతి స్త్రీ మనసూ మంత్రగత్తె మనసును పోలివుంటుంది. భర్త నుంచే కాదు, సమాజం నుంచి కూడా ఆమె ఆశించేది ఒక్కటే . తన జీవితం తన చేతుల్లో ఉండాలి. ఆ స్వేచ్ఛను ఆమెకు ఇవ్వనప్పుడే పరిస్థితులు వికృతంగా మారతాయి.




11 కామెంట్‌లు:


  1. కధ బాగుందండి.

    స్త్రీ అయినా పురుషుడైనా తనకు సంబంధించిన ఏ విషయమైనా తన చేతుల్లోనే ఉండాలనే కోరుకుంటారు.

    అయితే , తనకు సంబంధించిన ఏ విషయమైనా తన చేతుల్లోనే ఉండటమనేది ఎవరి విషయంలోనూ తీరే కోరిక కాదన్నది జీవితసత్యం.

    ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళే సంతోషంగా ఉండగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆనందం గారూ! కోరిక అంటేనే తీరనిది అని అర్థం. నెరవేరిన తర్వాత కోరికల జాబితాలోంచి దాన్ని తీసేస్తాం కదా. అప్పుడది కోరిక కాదు, అనుభవం అవుతుంది. అంటే జీవితం అవుతుంది. కోరికకు,జీవితానికీ ఉన్న తేడా అదే.
      మీ స్పందనకు కృతజ్ఞతలు!

      తొలగించండి
  2. పైన రాసిన శ్రీకాంత్ గారు పోస్టు చూసి వచ్చ్చాను. కథ బాగుందండి. చందమామ కతలు చదివిన రోజులు గుర్తు తెచ్చారు. మీ బ్లాగుకు సబ్స్క్రైబ్ అవుతాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కథ మిమ్మల్ని ఆకట్టుకున్నందుకు ఆనందంగా ఉంది. థ్యాంక్స్ గ్రీన్ స్టార్ గారు!

      తొలగించండి
    2. మాకు మీ థాంక్స్ సరిపోవండి, ప్రతి నెల ఇలాంటి మరో మూడు కథలు రాయాలి, అలాగయితే సరిపెట్టుకుంటాము. :)

      తొలగించండి
  3. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోయాను. రెండోసారి నిర్ణయం నేనే తీసేసుకున్నాను. నాకు సున్నా మార్కులు.

    రిప్లయితొలగించండి