ప్రతి నెలా అమావాస్య నాడు కనీసం చంద్రుడిని కూడా లేకుండా చేసి జగమంతా చీకటిని నింపుతున్న ప్రకృతికి ఒక్క రోజైనా సమాధానం చెప్పాలనుకున్నారు మనుషులు. వెలుగులను అందరికీ పంచాలనే స్వార్థరహిత తలంపుతో ప్రతి ఒక్కరూ తన ఇంటిలోనే కాకుండా వీధుల్లోనూ దీపాలు పెట్టారు. సంఘటితంగా భూమి పైనే చుక్కల్ని పరిచారు. పున్నమిని తలపించింది ఆ రేయి. అదే దీపావళి. నిస్వార్థ బుద్ధికీ, సంఘటిత శక్తికీ ప్రతీక ఈ పండుగ. ఈ రెండూ మనతో ఉంటే మన ఇంటే కాదు, జగమంతా నిత్య దీపావళి. మిత్రులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.పేజీలు
22, అక్టోబర్ 2014, బుధవారం
ప్రకృతి మీద తొలి తిరుగుబాటు యత్నం దీపావళి!
ప్రతి నెలా అమావాస్య నాడు కనీసం చంద్రుడిని కూడా లేకుండా చేసి జగమంతా చీకటిని నింపుతున్న ప్రకృతికి ఒక్క రోజైనా సమాధానం చెప్పాలనుకున్నారు మనుషులు. వెలుగులను అందరికీ పంచాలనే స్వార్థరహిత తలంపుతో ప్రతి ఒక్కరూ తన ఇంటిలోనే కాకుండా వీధుల్లోనూ దీపాలు పెట్టారు. సంఘటితంగా భూమి పైనే చుక్కల్ని పరిచారు. పున్నమిని తలపించింది ఆ రేయి. అదే దీపావళి. నిస్వార్థ బుద్ధికీ, సంఘటిత శక్తికీ ప్రతీక ఈ పండుగ. ఈ రెండూ మనతో ఉంటే మన ఇంటే కాదు, జగమంతా నిత్య దీపావళి. మిత్రులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)