పేజీలు

5, జనవరి 2010, మంగళవారం

పరోక్ష హింస మొదలయ్యింది !

ఈరోజు ఆంధ్ర జ్యోతి దినపత్రికలో సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాసిన తెలంగాణా రచయితల వేదిక వారికి,

'విభజనతో సమైఖ్య భావన' అని రాసిన వరవరరావు గారికి ,

ఇతర తెలంగాణా వాదులకు,

అయ్యా,

ఈ క్రింద ఉదహరించిన సంఘటనలకు ఎవరు సమాధానం చెప్తారు?

కొబ్బరిబోండాం దుకాణం..

అమ్ముతున్నది ఒక ఆడ మనిషి . ఒకతను వచ్చి ఎంత అన్నాడు? ఒకటి పది రూపాయలు అంది. వాళ్ళ సంభాషణలని బట్టి ఆమె ఆంధ్ర , అతను తెలంగాణా అని తెల్సింది. ఒక బొండాం అక్కడే తాగేసి మరొకటి పార్సెల్ తీసుకున్నాడు. పదిహేను రూపాయలు ఇచ్ఛి వెళ్ళబోయాడు.

'అదేంటి ఇంకా ఐదు రూపాయలియ్యి. ' అంది.

'మల్లచ్చినప్పుడు ఇస్తాలే' అని పోతానే ఉన్నాడు.

'ఆగు! అదేం కుదరదు. డబ్బులియ్యి .'

'ఏయ్ లేవ్ ఫో '

'అయితే కాయక్కడ ఎట్టు'అంది గట్టిగా .

'ఏయ్ ఏందీ సెప్పిన గంద . ఏడికి పోత?'

'నువ్వెవరో నాకు తెలీదు ముందు కాయ అక్కడ పెట్టు.'

'ఏయ్ నేనేవరనుకున్నావ్ . దుకాణం లేపెస్తా'

'ఆ ఆ చూసంలె . దుకాణం ఎమన్నా ఊరికే ఇచ్చారా. బోలెడు డబ్బులిచ్చాం.' (ఆవిడ అన్నది కిరాయి గురించి కాదు. రాజధానిలో ఎక్కడ ఎవరు ఎం చేయాలన్నా వీధి రౌడి గార్లకు డబ్బులిచ్చి వారి అనుమతి తీసుకోవాలి.)

'ఏయ్ ఏందే నకరాలు సేస్తున్నావ్ . నీ తల్లి యాదికేల్లో బతకనికి అచ్చి

'ఇదిగో మాటలు తిన్నంగా రాణి. మాకు వతాయ్ మాటలు. డబ్బులెట్టి కాయ కోనుక్కోలేదు గాని మాటాడు తున్నాడు

'నోర్ముయ్ ఆంద్ర లం... పడేసి ...'

అమ్మా సంధ్యమ్మ తల్లి ! చేతికి గాజులేసుకు కూర్చోలేదు అని మోహన్ బాబు అన్న మాటకే తరిమి కొడతాం అన్నారు . ఈ మహిళకు జరిగింది అవమానం కాదా ? లేక ఆంద్ర మహిళకు ఆత్మగౌరవం లేదంటారా?

సనత్ నగర్లో ..ఒక చోట...

ఉన్నట్టుండి ఓనరు ఇంటి అద్దె వెయ్యి పెంచాడు. అన్యాయం కదా అంటే ' మా తెలంగాణాలో అట్లే ఉంటది. ఇష్టమైతే ఉండు లేకుంటే నీ ఆంధ్రాకు ఫో?' కర్కశంగా అన్నాడు.

మరోచోట తన ఇంట్లో అద్దెకు ఉన్న ఆంద్ర వాళ్ళని మాత్రమే ఖాళీ చేయించాడు ఇంటాయన.

మరో ఘటన !.....

మా ఆటో అతను చాలా మంచివాడు. ఇదివరకు ఎప్పుడూ అతను సంస్కార హీనంగా మాట్లాడలేదు.

మొన్నొక రోజు ...

నేను ఆటో ఎక్కింది మొదలు ఆంధ్రావాల్లను దోపిడిగాళ్ళని , మోసగాళ్ళని, తరిమి తరిమి కొట్టాలని ..చాలా ఆవేశంగా మాట్లాడాడు. అతనిలో అంత ఆవేశం గత సంవత్సర కాలంలో ఎప్పుడూ చూడలేదు. అనాల్సినవన్నీ అన్నాక నన్ను అడిగాడు. మీరు ఆంధ్రోల్లా? తెలంగాణా వోల్లా? అని.

నేనేం సమాధానం చెప్పాలి? ఏ లెక్కలు ఉన్నాయి దీనికి? ముల్కి నిబంధనలా ? జే ఏ సి వాళ్ళేమైనా ప్రమాణాలు డిసైడ్ చేశారా ? నా తల్లిది తెలంగాణ . నా తండ్రిది ఉత్తరాంధ్ర . నేను పుట్టింది హైదరాబాదులో . పెరిగింది విజయవాడ. స్థిరపడింది మళ్ళీ ఇక్కడ. రాష్ట్రమంతా నాదే అనుకుని తిరిగాను. ఆ మాటకొస్తే దేశం, ఈ భూ ప్రపంచమే నాది. నన్ను ఆపే హక్కు ఎవరికుంది? ఏ తెలంగాణ వాళ్ళు విదేశాల్లో బతకడం లేదా? అలాగే నేను. ఆంద్ర వాళ్ళు.

ఎవడు ఎవడిని దోచుకున్నాడు? నీలో పోటీ పడే తత్త్వం లేక , బాగుపదాలన్న తపన లేక వెనుక పడితే అది ఎవడి తప్పు? నిన్ను చదువుకోకుండా ఎవరు ఆపారు? ఉద్యోగం చెయ్యకున్ద ఎవరు అడ్డుకున్నారు? నీ ప్రాంతం వెనుక బాటుకు నీ ప్రాంతం నుండి నీచే ఎన్నిక కాబడి యాభై ఏళ్లుగా నీ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించిన నీ ఎమ్మేల్లెలని నిలదీయి. నీ ప్రాంతం , నువ్వు వెనుకబడి ఉండగా వాళ్ళంతా కోట్లు ఎలా సంపాదించారో అడుగు. వాళ్లకు అడ్డు రాణి ఆంధ్రా వోడు నీ ఎదుగుదలకు ఎలా అడ్డయ్యాడు? అడుగు? కొడుకులను నిలదీయి? చిచ్చు పెట్టిండ్రు తమ్మీ. నీకూ నీ వాళ్ళకు మద్య చిచ్చు పెదతన్నారు.

అంత దాక ఎందుకు? మాటాడితే తెలంగాణా కావాలె అనేతోల్లంతా తెలంగాణా ఇస్తే ఏరకంగా అభివృద్ది చేస్తారో ప్రణాలికలతో ఉన్నారా?

అయ్యా !...దొరా ... హైదరాబాదులో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గం పరోక్ష హింసకు గురౌతోంది . అందుకే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి. అప్పుడే రెండు వర్గాలకు గౌరవం.

8 కామెంట్‌లు:

  1. చంద్రమోహన్ గారు ,
    నిజాలు వ్రాసారు..ఇంకొన్ని ఉదాహరణలు:(ఇవి నేను ప్రత్యక్షంగా చూసినవి )
    1)నిజామాబాదులో నా స్నేహితుడు 15 సంవత్సరాలుగా ఒక విద్యా సంస్థనడుపుతున్నాడు..చుట్టుపక్కల గ్రామలనుంచి కూదా పిల్లలు ఇక్కదికి వచ్హి చదువుకుంటుంటారు.మొన్న జరిగిన విద్యార్ధి గర్జన ముందు రోజు కొంతమంది వచ్హి ఫలానా నాయకుడు పంపించాదు మీ బస్సులు రేపు ఫుల్ డీసిల్ కొట్టి పంపించండి అని వెలిపొయారు..మా వాడు ఎందుకులే వాళ్ళతో అని ఒక రెండు పంపించటానికి సిద్ధం అయ్యడు..రాత్రి 1 గంటకి ఒక ఎం ఎల్ ఏ ( పేరు నేను రాయను) ఫొన్ బస్సులు పంపకపోతే మొత్తం రేపే తగలేస్తాం అని...మా వాడు కొంథమంది పలుకుబది వున్న వారిని సంప్రదించినా వారు ఏమి చెయ్యలెక పోయారు...
    2) హైద్రబాద్ కి 60 కిమి దూరంలొవున్న ఒక వూరిలో ప్రొజెక్టెర్ పెట్టి అంధ్రావాళ్ళ అన్యాయాలు అని ఒక సినెమా వేస్తున్నరు..దానిలొ 1958 వుద్యమం అని పేరు కాని బాక్ గ్రౌండ్ లో చాలా రెచ్హ్గొట్టే వ్యాఖ్యనాలు..
    ఇది ఎంథవరకూ సమంజసం..

    రిప్లయితొలగించండి
  2. Antisemitism starting phase inka chala chudalasindhi vundhi ,after this any time he was in trouble he will make sure to abuse us

    for example ysr abusing cbn for his 9 years rule

    no doubt we will be considered as 2nd grade citizens in our own capital :-(

    రిప్లయితొలగించండి
  3. అదేనండీ.... కష్టపడి సాధించడం తెలీదు గానీ మీరు బాగుపడిపోయారని ఏడవడం మాత్రం తెలుసు. ఉద్యోగం చేస్తూ చదువుకుని ఈ రోజు లక్షలు సంపాదిస్తున్న వారు నాకు చాలా మంది తెలుసు. కానీ పక్కనోడు ఎంత కష్టపడి పైకి వచ్చాడా అని కాక - మా అవకాశాలు లాక్కున్నారు అనే పిచ్చి మాటలతో కాలాన్ని వృధా చేసుకోవడం మాత్రం తెలుసు వీరికి. తెలంగాణాలో కూడా కష్టపడే వారూ ఉన్నారు - వారి కష్టంతో, స్వశక్తితో వారు పైకి వస్తున్నారు. అలాటి వారిని చూసైనా వీరు బుద్ధి తెచ్చుకోరు. దౌర్జన్యం తో తెలంగాణా సాధించుకోవచ్చని, పొమ్మనక పొగ పెడితే ప్రత్యేక రాష్ట్రం వస్తుందని అనుకుంటున్నారు. కానీ హైదరాబాదు ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని అనే విషయం మరచిపోతున్నారు. నా రాష్ట్ర రాజధాని లో నివసించే హక్కు నాకు ఉంది అని ప్రతీ ఒక్కరూ ఇలాటి వారికి చెప్పి తీరాలి.

    రిప్లయితొలగించండి
  4. excellent post..ఒకరి వెనుకుబాటుతనం ఇంకొకరి దోపిడీవల్లనే అన్న పోయిసన్ ప్రజల్లో ఇంజెక్ట్ చేయబడడం వల్లనే తెలంగాణ ప్రజలు ఈ రోజు ఈ విధంగా రేయాక్ట్ అవుతున్నారు యే రాష్ట్రం అయినా పేదవాడు మద్య తరగతి ప్రజలకు ఇబ్బందులు యెప్పుడు తప్పవు ..ఇక ఈ విభజనలన్నీ రాజకీయ మనుగడ కోసం కొందరి నాటకాల ఫలితమే.. కొత్త రాష్ట్రం వచ్చినంత మాత్రాన స్వర్గమేమి తెలంగాణ ముంగిట నిలబడదు ..

    రిప్లయితొలగించండి
  5. I totally condemn the acts of above people.
    But his is not the first time any person is doing such kind of acts.
    May be you might not have come acrossed this kind of scenarios before and now as you face them I guess you understand much better how you feel facing them.
    These kind of actions were going on since many years in govt offices, schools, among friends and every where about the culture, about the language, about the food and so many other things. the differnce was at that time the actions were done by andhras and bearers were telanganites.
    మాటాడితే తెలంగాణా కావాలె అనేతోల్లంతా తెలంగాణా ఇస్తే ఏరకంగా అభివృద్ది చేస్తారో ప్రణాలికలతో ఉన్నారా?
    do you have any laid out plans about devlopment of telanganites if united ?
    Do you know why Telnaganites want seperate telangana( don't think the above are the reasons)and do you have any solutions to solve them if united.
    First try to understand the root cause. Think before writing these kind of posts don't spread hatredism

    రిప్లయితొలగించండి
  6. avunandi baita paristiti alane undi, dini pai nenu kuda spandista oka Tapa rasta

    (1999 - 2009) TOP-20 తెలుగు కథానాయికల్ని మీరే ఎంచుకోండి!
    visit to poll:
    http://blogubevars.blogspot.com/

    అనుకోకుండా కొందరి పేర్లు TOP-20 లిస్టు లో పెట్టలేక పోయాను, అక్కడ ఉన్నవారికి మీ వొటు వేయండి.

    రిప్లయితొలగించండి