పేజీలు

28, జనవరి 2010, గురువారం

చెరిగి పోతున్న స్మృతులు


ఉమ్మడి కుటుంబపు పరువు, బరువులను బాధ్యతగా మోసే ఒక పెద్దన్న, మానవత్వం మూర్తీభవించిన ఒక జమిందారు, ప్రేమను అంగీకరించలేని ఒక తండ్రి , ఎన్ని కష్టాలు వచ్చినా కట్టుబాటు దాటని ఒక సాంప్రదాయ వాది...
ఇతిహాసాలలో... ధర్మరాజు, విశ్వామిత్రుడు, వసిష్టుడు, భ్రుగు మహర్షి, దూర్వాసుడు , పరశురాముడు, భీష్ముడు..

చరిత్రకు... తిమ్మరుసు, పోతన.... ఇలా ఎన్నో పాత్రలు ...

పంచెకట్టు, భుజాన కండువ, చేతిలో ఊతకర్ర , తీరైన మీసపు కట్టు , పొడుగాటి ముక్కు ... మొత్తంగా ఆప్యాయత మూర్తీభవించిన రూపం, గౌరవిన్చాలనిపించే పెద్దరికపు లక్షణాలు... ఇది వేషధారణ.

ఇక మాట ..ప్రతి తెలుగు వాడూ వింటూనే గుర్తుపట్టగల కంటస్వరం .
నిన్నటి దాక అది కనీసం గతంగానైన ఉండేది. ఇప్పుడు ఏకంగా మాయమైంది. ఆనాటి చిత్రాలు, మరువలేని పాత్రలు, మహా నటులు...ఇదంతా గతమే. అయితే ఆ గత వైభవ చిహ్నాలుగా నాటి నటులు ఎప్పుడైనా కంటి ముందు కదలాడితే మనసుకు ఆనందంగా ఉండేది. కాని ఒక్కొక్కరుగా వారంతా మాయమై పోతోంటే ఏదో వైరాగ్యం ఆవరిస్తూంది.
నాడు కళాకారులకు హద్దులు లేవు . మాయాబజార్ సినిమాకు పనిచేసిన కెమరమన్ మన తెలుగు వాడు కాదు . మన ఇతిహాసాలను నమ్మిన వాడూ కాదు. ఒక కళాకారుడిగా అతను పనిచేసాడు .అతని కళను మనమందరం హర్షించాం . అది ఆనాటి సంస్కృతి . ఇక ఈనాటి సంస్కృతిని మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఆ తరం మనల్ని వదిలి పోతోంటే ఒక రకమైన గుబులు. దిగులు .

గుమ్మడి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి