పేజీలు

2, మార్చి 2015, సోమవారం

వాట్సప్ పంచ్

 2

'సార్ ! మా ఆవిడ కనిపించట్లేదు' పోలీస్ స్టేషన్లో  ఎస్ ఐ కి కంప్లైంట్ చేశాడు మొగుడు.   
ఎస్ ఐ : చెప్పండి! మీ ఆవిడ ఎప్పట్నుంచి మిస్సింగ్
మొగుడు : నిన్న షాపింగ్ కోసం బయటికి వెళ్ళింది. మళ్ళీ రాలేదు.
ఎస్. ఐ . : ఆవిడ ఎత్తు ఎంత చెప్పండి
మొగుడు : యావరేజ్ అనుకుంటా సర్.
ఎస్ ఐ : ఆరోగ్యం బాగుందా ?
మొగుడు : బాగానే ఉందనుకుంటా
ఎస్ ఐ : ఆవిడ కళ్ళ రంగు ?
మొగుడు : ఎప్పుడూ గమనించలేదు సర్
ఎస్ ఐ : జుట్టు రంగు ?
మొగుడు : ఒక్కో సీజన్లో ఒకలా ఉంటుంది
ఎస్ ఐ : ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు? అప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారా ?
మొగుడు : ఉన్నాను సర్! కాకపోతే చీరలో వెళ్ళిందా, పంజాబీ డ్రెస్ లో వెళ్ళిందా సరిగా చూడలేదు .
ఎస్ ఐ : షాపింగ్ కు ఎలా వెళ్లారు ? ఐ మీన్ ఏదైనా వెహికల్ ?
మొగుడు : అవును సర్ ! కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది
ఎస్ ఐ : కారు రంగు ?
మొగుడు : బ్లాక్ కలర్ ఆడి ఎ 8 విత్ సూపర్ చార్జ్ డ్ 3. 0 లీటర్, వి 6 ఇంజన్ జనరేటింగ్ 333 హెచ్ పి , ఎయిట్ - స్పీడ్ టిప్ట్రోనిక్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ విత్ మాన్యువల్ మోడ్. ఎల్ ఇ డి హెడ్ లైట్స్. ఎడమ వైపు  ఫ్రంట్ డోర్ మీద సన్నగా 3 సెంటీ మీటర్ల స్క్రాచ్ ఇంకా... 
గడాగడా చెప్పేసి ఏడవడం మొదలెట్టాడు మొగుడు.
ఆ ఏడుపు చూసి కరిగిపోయిన ఎస్ ఐ,''ఊరుకోండి సర్ ! ఎలాగైనా మీ కారును వెదికి పట్టుకునే పూచీ నాది '' అన్నాడు ఆ మొగుడిని అనునయిస్తూ. 

   

4 కామెంట్‌లు:

  1. పాపం ఆ మొగుడికి కారు మీదున్నంత శ్రద్ధ పెళ్ళాం మీద లేకపోయింది :)

    రిప్లయితొలగించండి
  2. జోక్ బాగుంది.
    కారు, భార్య అంటే పాత జోకొకటి గుర్తొచ్చింది. ఇక్కడ పూర్తిగా అతకక పోయినా ఆ జోక్ - భార్య కారు ఎక్కటానికి భర్త కారు తలుపు తెరిచి పట్టుకున్నాడంటే కొత్త కారు అయినా అయ్యుండాలి, కొత్త భార్య అయినా అయ్యుండాలి. :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇల్లరికపు అల్లుడు కూడా అయ్యుండొచ్చు విన్నకోట గారు

      తొలగించండి
  3. ఇల్లరికపుటల్లుడు ..... హ హ హ. కరక్టేనండి, ఆ కోణం కూడా సాధ్యమే.

    రిప్లయితొలగించండి