

ముందు సినిమా విశేషాలను చూద్దాం.
- రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రాల బడ్జెట్ రూ. 250 కోట్లు.
- మొదటి భాగానికే రూ.135 కోట్లు అయ్యిందని వినికిడి. కొన్ని పత్రికలు 150 కోట్లు అనికూడా రాశాయి..ఏదయినా ఇదొక చరిత్రే.
- దాన్ని మించిన చరిత్ర ఏంటంటే, మొదటి భాగం 162 కోట్లు బిజినెస్ చేయడం.
- ఇందులో థియేటర్ బిజినెస్ 125 కోట్లయితే, శాటిలైట్ హక్కులకు 36 కోట్లు, ఆడియో రైట్స్ 1 కోటి చొప్పున మొత్తం 162 కోట్లు అని పత్రికా కథనాలు చెబుతున్నాయి.
- ఒక్క తెలుగు వెర్షన్ కే రూ.82.30 కోట్ల బిజినెస్ చేసి ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది.
- తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లో జులై 10న ఏకంగా 4000 పై చిలుకు థియేటర్స్ లో విడుదల కానుంది.
- ఎపి, తెలంగాణా రాష్ట్రాలలో 1400 వందల థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. కర్ణాటకలో 150 థియేటర్లు, కేరళలో 250 థియేటర్లలో విడుదలవుతోంది.
- ఇక ప్రీమియర్ షోలను ఏపీ, తెలంగాణలో జూలై 9 అర్ధరాత్రి ఒంటిగంటకే వేయనున్నారు.

కొద్ది రోజుల క్రితం '3' సినిమా కోసం ధనుష్ పాడిన 'కొలెవరి' పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. సోషల్ మీడియాలో అది సృష్టించిన సంచలనం కూడా గుర్తే కదా. చివరికి సినిమా రిలీజయ్యాక పరిస్థితి ఏమయ్యింది? దానికి, దీనికి పోలిక లేకపోవచ్చు. కానీ ప్రేక్షకుడి అంచనాలను మితిమీరిన స్థాయికి తీసుకెళ్ళాక అంతే స్థాయిలో తృప్తి పరచడం అంత వీజీ కాదు మరి.
మరో విషయం ఏంటంటే ఎంత మంచి కథ అయినా రెండు భాగాలకు సర్దినప్పుడు, రెండవ భాగం పలుచన కాకుండా మొదటి భాగాన్ని కాస్త సాగదీయడం జరుగుతుంది. అలాంటిది ఇందులో కూడా జరిగి ఉండొచ్చు.
కేవలం విజువల్ ఎఫ్ఫెక్ట్స్ తో ఇంగ్లీష్ సినిమాలా తెలుగు సినిమాను నడపడం కష్టం. మన సినిమాలకు కథ, సెంటిమెంటు, ప్రేమ, పాటలు, యాక్షన్, గ్లామర్... ఇలా చాలా ఎఫెక్టులు ఇవ్వాలి.
ఏది ఏమైనా ఇంకాసేపటిలో అటు బాహుబలి సినిమా భవిష్యత్తు, ఇటు భావి తెలుగు సినిమా రూపురేఖలు స్పష్టం కానున్నాయి. ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే ఈ చిత్ర ప్రభావం చిన్న సినిమాలపై ఎలా ఉండబోతోందో అన్నది చూడాలి. ముఖ్యంగా 'రుద్రమదేవి' సినిమాపై ఇది చాలా ప్రభావం చూపే వీలుంది.
ఏది ఏమైనా ఇంకాసేపటిలో అటు బాహుబలి సినిమా భవిష్యత్తు, ఇటు భావి తెలుగు సినిమా రూపురేఖలు స్పష్టం కానున్నాయి. ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే ఈ చిత్ర ప్రభావం చిన్న సినిమాలపై ఎలా ఉండబోతోందో అన్నది చూడాలి. ముఖ్యంగా 'రుద్రమదేవి' సినిమాపై ఇది చాలా ప్రభావం చూపే వీలుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి