లంచ్ బ్రేక్ లో ఏదైనా హోటల్ లో భోంచేద్దామని ఆఫీసు నుంచి బయటకు బయలుదేరాడు మేనేజర్. వరండాలో ఆఫీసు క్లర్క్, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ లు కనిపించేసరికి తనతో పాటు రమ్మన్నాడు. బీచ్ పక్కనే ఉండటంతో సరదాగా నడిచి వెళ్తున్నారు. అలా వెళ్తుంటే మేనేజర్ కాలికి ఒక పాత దీపం లాంటిది తగిలింది. ఆలీబాబా అద్భుత దీపం అని అరిచారు మిగిలిన ఇద్దరూ.
'అయితే దీన్ని రుద్ది, కోర్కెలు తీర్చే భూతం వస్తుందేమో చూద్దాం' అన్నాడు మేనేజర్. ఆత్రంతో ఆగలేక మేనేజరుతో పాటు మిగిలిన ఇద్దరూ కూడా రుద్దారు. నిజంగానే భూతం బయటకు వచ్చింది. 'అయ్యలారా! దీపం రుద్ది నన్ను ఎవరైతే పిలిచారో, వారు కోరిన మూడు కోరికలను నేను తీర్చగలను. కానీ మీరు ముగ్గురూ ఒకేసారి రుద్ది నన్ను పిలిచారు కాబట్టి, ఒక్కొక్కరికీ ఒక్కొక్క కోరిక మాత్రమే తీర్చగలను. చెప్పండి ఏమి మీ కోరిక' అని మూడు తలలు తెచ్చుకుని ముగ్గురినీ చూస్తూ అడిగింది. ముందు నేనంటే నేనంటూ ఎగబడ్డారు క్లర్కూ, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ లు.
'మీ కోరికలు తీర్చకుండా నేను వెళ్ళలేనుగా అలాంటప్పుడు ఎందుకు తొందర? ముందు మీరు చెప్పండి' అంటూ క్లర్కును అడిగింది భూతం.
'మాహిష్మతి రాజ్యంలోని కోటలో అవంతికతో రొమాంటిక్ గా గడపాలి' అన్నాడు క్లర్కు. 'అలాగే' అంది భూతం. వెంటనే అక్కడ నుంచి మాయమయ్యాడు క్లర్కు.
'ఇప్పుడు మీ కోరిక.' మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ ను అడిగింది భూతం.
'పారిస్ లోని పార్క్ హయత్ లో ఇంపీరియల్ సూట్ బుక్ చేసుకుని జురాసిక్ వరల్డ్ హీరొయిన్ డల్లాస్ హోవార్డ్ తో బెడ్ షేర్ చేసుకోవాలి' అన్నాడు రిప్. అలాగే అని భూతం అనడం రిప్ అదృశ్యం కావడం రెప్పపాటులో జరిగిపోయింది.
'ఇప్పుడు మీ కోరిక చెప్పండి ఆర్యా!' మేనేజర్ ని అడిగింది భూతం.
అప్పటికే కుతకుతలాడుతున్నాడు మేనేజర్. ' క్లర్కు, రిప్.. ఇద్దరూ ఇంకో క్షణంలో నా ముందుండాలి' అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్టుగా.
'
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి