అది హైదరాబాదు లోని బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక బడాబాబు ఇల్లు.
''ఆ అమ్మాయినే చేసుకుంటానంటే నీకు ఈ ఆస్తిలో నయాపైసా కూడా ఇవ్వను!'' గద్దించాడు బడాబాబు.
''మరేం పరవాలేదు! నాకు ప్రేమ దొరికితే చాలు. అదే తింటాను. అదే తాగుతాను. అదే పీలుస్తాను. '' నిన్నే గర్ల్ ఫ్రండుతోఐమాక్స్ థియేటర్ లో చూసిన యూత్ సినిమాలోని డైలాగును ఉద్వేగంగా చెప్పాడు దొరబాబు.
''ఒరేయ్! డబ్బులో పుట్టి డబ్బులో పెరిగినోడివి. ఖర్చు పెట్టడం తప్ప సంపాదించడం చాతకానోడివి. డబ్బు లేకుండా ఎలాబ్రతుకుతావురా?" బెదిరించే ప్రయత్నం చేసాడు బడాబాబు.
"నన్నేం బెదిరించక్కర లేదు. కూలి పని చేసుకు బ్రతుకుత."
"పిచ్చోడా! కూలి పని చేస్తావా? హ్హ హ్హా ! "
"ఎందుకంత ఎగతాళి? కావాలంటే కూలిపని చేసి రేపు ఈపాటికి పది లక్షలతో ఇంటికి వస్తా. నేనేంటో నిరూపిస్తా !"
ఆవేశంగా బయటకు వెళ్ళాడు దొరబాబు. కూలీ అన్న మాట వినను కూడా వినని కొడుకు ఈ చాలెంజి ఎలాచేసాడబ్బా...అని బుర్ర గోక్కుంటున్న బడాబాబు దృష్టి టేబుల్ పైన ఉన్న వార్తా పత్రిక పైన పడింది. 'కూలి చేసిపద్నాలుగు లక్షలు సంపాదించిన కేసీఆర్ .' అన్న హెడ్డింగు చూసి నవ్వుకున్నాడు బడాబాబు.
*******
అదే హెడ్డింగు చూసి ఇంకొకడు కూడా నవ్వుకున్నాడు. వాడెవడో కాదు! తరతరాల నుంచీ కూలీ బతుకీడుస్తూ ఈనాటికికూడా పూట గడవని స్థితిలో ఉన్న నిజమైన కూలీ.
పేజీలు
25, నవంబర్ 2010, గురువారం
4, నవంబర్ 2010, గురువారం
దీపావళి శుభాకాంక్షలు !
కాలుష్య రహిత దీపావళిని , కల్మషం లేని మనసుతో , కల్తీ లేని ఆనందంతో కాంతి భరితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ... మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
కాలుష్య రహిత దీపావళి - మామూలు రోజుల్లోనే వాతావరణ కాలుష్యం ఎక్కువ. ఇక దీపావళికి అది రెండు వందల శాతం ఎక్కువ కలుషితం అవుతుందని అంచనా. అందుకని టపాసులను ఎక్కువగా కాల్చకండి. వాయు కాలుష్యాన్ని పెంచాకండి. ఇక మామూలుగా మన చెవులకు అరవై దేసిబుల్స్ స్థాయి శబ్దాలు మాత్రమే అనుకూలం. అంతకు మించి స్థాయి గల శబ్దాలు రక్త పోటును పెంచి గుండెపోటుకు కారణం అవుతాయి. అందుకని పెద్దగా శబ్దం చేయని టపాసులను కాల్చండి.
కల్మషం లేని మనసు - టపాసులు కాలుస్తా .....చాలామంది డబ్బులు కాలిపోతున్నాయి అని భాధ పడుతూ ఉంటారు. కాని తప్పదు. పిల్లలు ఊరుకోరు కదా. దానికి మించి పొరుగువాడు కాలుస్తుంటే మనం కాల్చకపోవడం అనేది శ్రీమతికి నామోషి. అందుకని డబ్బులు తగలెయ్యడం అంటే టపాసులను కాల్చడం తప్పట్లేదని అనుకుంటూ బాధపడుతుంటారు. కాని ఒక్కసారి మీ పిల్లల ముఖాల్లోకి చూడండి. ఆ ఆనదాన్ని ఎంత డబ్బు పెట్టి కొనగలరు? దానితో పోలిస్తే మీరు తపసులకు తగలేసేది తక్కువే. కాబట్టి సంతషంగా పండుగ చేసుకోండి.
దీపావళి శుభాకాంక్షలతో ...

20, జులై 2010, మంగళవారం
బాబ్లీ సమస్య ఎవరిది?
బాబ్లీ విషయంలో బాబుది ఓవర్ యాక్షన్ అని రాజకీయ వ్యాఖ్యలు. ఉప ఎన్నికల దృష్ట్యా లాభ పడేందుకే ఈ రభస అని విశ్లేషకుల అభిప్రాయం కూడా. అయితే అసలు ఈ సమస్య తెలంగాణా రైతులది అన్న విషయం అన్ని పార్టీలు , వార్త చానెళ్ళు, మేధావులు మర్చిపోయినట్టున్నారు.
తెలంగాణా తన సొత్తు అని భావించే కేసీఆర్ బాబ్లీ గురించి పట్టించుకోకపోవడం విడ్డూరం. రాజకీయం కోసమే తెలంగాణా వాదం తప్ప ప్రజల మేలు కోసం కాదన్నది ఆ పార్టీ పాలసీ ఏమో!
ఇక మా పార్టీ హయాంలో తెలంగాణా ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి తెలంగాణా ప్రజలు మమ్మల్నే గెలిపించాలి అని పిలుపు నిచ్చే కాంగ్రెస్స్, బాబ్లీ గురించి ఎనాడైన పట్టించుకుని ఉంటె సమస్య ఇంత దాక వచ్చేదే కాదు. ఇప్పుడు కూడా చంద్రబాబుని ఆడిపోసుకోవడం తప్ప ఆ విషయం మాకు సంబంధించింది కానే కాదు అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఈ విషయంలో కేంద్రం మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఇది రెండు రాష్ట్రాల సమస్య అట. రాష్ట్రం నుంచి ముడుపులు కావాలి. రాష్ట్రం నుంచి ఎంపీ సీట్లు కావాలి. తెలంగాణా విషయంలో వేలు పెట్టి లబ్ది పొందాలి. కాని బాబ్లి దగ్గరికి వచ్చే సరికి మీరు మీరూ చూసుకోండి అని తప్పించుకుంటారు. కారణం రెండు రాష్ట్రాల్లో ఉన్నది మన పార్టీనే మరి. అందుకే ఇలా మొహం చాటేయడం. అదే ఈ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట వేరే పార్టీ అధికారంలో ఉంటె ఇలాగే మాట్లాడే వారా? పెద్ద రగడ చేసేవారు కాదా? కేంద్ర రాజకీయం మరి!
ఇక కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడూ ఏమీ మాట్లాడలేని స్థితిలోనే ఉంటుంది. బాబు గొడవతో చిరు చేసిన ఏడుకొండల పాద యాత్ర పబ్లిసిటీకి నోచుకోకుండా పోయింది. సమైక్య నినాదంతో తెలంగాణలో పోగొట్టుకున్న అభిమానాన్ని బాబ్లి విషయంలో చంద్ర బాబుకు మద్దతివ్వడం ద్వారా సంపాదిన్చుకున్దామా అంటే, ఈ మధ్యే కాంగ్రెస్స్ తో కొత్త దోస్తాన కలిసిన్దాయే. వారి మాటే వీరి మాట, వారి బాటయే వీరి బాటగా పరిస్థితి ఉంది. అందుకని వారేమి మాట్లాడే స్థితిలో లేరు.
ఇక వామపక్షాలు కూడా బాబ్లీ విషయంలో చురుకుగా ఏమీ లేరు. కారణం ఏంటో?
ఇలా పార్టీలన్నీ స్వలాభాలే చూసుకుంటుంటే అసలు సమస్య తీరేదెప్పుడు? ఎలాగూ ఏదో కారణంతో బాబు విషయాన్ని ఇంతదాకా లాక్కొచ్చాడు కాబట్టి , పైగా ఇది రాష్ట్ర రైతులందరి సమస్య కాబట్టి, పార్టీలన్నీ భేషజాలను , స్వప్రయోజనాలను పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలి. ఇది పార్టీల సమస్య కాదు. ప్రజల సమస్య. రాష్ట్ర సమస్య. అంతకన్నా మించి ఇది మన ఐక్యతను , ఆత్మగౌరవాన్ని చాటే సందర్భం. మనలో మనకు ఎన్ని గొడవలు ఉన్నా వాటిని పక్కన పెడదాం. నిజమైన ప్రజా సమస్య గురించి పోరాడదాం.
కొసమెరుపు: మన రాజకీయ నాయకులకు కటిక నేలపై , దోమల మద్య, సరైన సౌకర్యాలు లేని చోట నిద్రించడం అంటే ఏమిటో , ఇలాంటి జీవితాన్ని నిత్యం ఎంత మంది ప్రజలు ఎలా నెట్టుకు వస్తున్నారో అర్థం అయ్యే అవకాశం కలింగించిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకందుకు అభినందించాల్సిందే. మహిళా నాయకులూ ! ఈ మాత్రం దానికే కంటినుండి నీళ్ళు వచ్చాయే మీకు. మీ నియోజక వర్గాల్లో ఎంత మంది మహిళలు ఇలాంటి ప్రత్యక్ష నరకంలో జీవిస్తున్నారో ఇకనైనా ఆరా తీసి, వారి కోసం ఏమైనా చెయ్యగలరా?

26, మే 2010, బుధవారం
నా సిమ్లా పర్యటన
వేసవికాలం సమీపిస్తోంది. సమ్మర్ టూర్ కోసం ప్లాన్ చేసుకోవలసిన సమయం ఇది. అందుకే నా టూర్ అనుభవాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. చదువరులకు కొంతలో కొంత ఈ బ్లాగు ఉపయోగపడుతుందని నా ఆలోచన.
ప్రతి వేసవిలోనూ ఏదో ఒక పర్యాటక కేంద్రానికి, ముఖ్యంగా హిల్ స్టేషన్లకి వెళ్ళడం మాకు ఇష్టం , అలవాటు కూడా. ఎప్పటినుంచో సిమ్లాకి వెళ్లాలని కోరిక. ఆ కోరిక క్రిందటి వేసవిలో తీరింది. నాలుగు నెలల ముందుగానే ప్రణాళికలు మొదలయ్యాయి. ముందుగా బడ్జెట్ అంచనా వేస్తే ఎనభై వేల దాకా తేలింది. ఎందుకంటే అంత దూరం వెళ్తున్నాం కాబట్టి పలానా ప్రదేశాన్ని కూడా చూసొద్దాం అంటూ ఒక్కో ప్రదేశాన్ని కలుపుకుంటూ పోయే సరికి అంత బడ్జెట్ తేలింది. మా ఆవిడ ప్రభుత్వోద్యోగి కావడంతో రెండు బ్లాకుల ఎల్టీసిని ఈ పర్యటన కోసం వాడుకోవాలనుకున్నాం. అలాగే సిమ్లా, మనాలిలలో ఉన్న వాళ్ళ హాలిడే హోమ్స్ లో గదులను బుక్ చేసాం. ఎ.పి. ఎక్స్ ప్రేస్సుకు వెళ్ళేటప్పుడు సెకండ్ ఏసిలో , వచ్చేటప్పుడు థర్డ్ ఎసి లో టికెట్లు బుక్ చేసాం. అన్నీ ఫిబ్రవరిలోనే.
అంత ముందుగా బుక్ చేసుకున్నా కన్ఫర్మ్ కావడానికి మూడు నాలుగు రోజులు పట్టింది. అందుకే సమ్మర్ టూర్ ను ఎప్పుడూ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. డిల్లీ నుంచి మిగతా టూర్ కోసం సిక్స్ సీటర్ వెహికిల్ బుక్ చేసాం. కిలోమీటరుకు తొమ్మిది రూపాయలు చొప్పున మాట్లాడుకున్నాం. నిజానికి ఢిల్లీ నుంచీ షిమ్లా వరకు రైలు సౌకర్యం ఉంది. అయితే లగేజిని, మా బృందంలో ఉన్న పెద్దలు, పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని టాక్సీ లో వెళ్ళాలనుకున్నాం. అదెంత పొరబాటో తర్వాత తెలిసింది.
టూరుకు వెళ్ళేంత వరకు రోజుకో ఆలోచన. రోజుకో ప్రణాళిక. ఎంతో ఉత్సుకత. అక్కడి ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు స్వీప్ పనోరమ సౌకర్యం ఉన్న సైబర్ షాట్ కెమెరాను కొన్నాం. దాదాపు ప్రతిరోజు టూర్ గురించి కాంత డిస్కషన్. అంతకు ముందే వెళ్లి వచ్చిన వాళ్ళు తగిన సజెషన్స్ ఇచ్చారు. నేనైతే ఇంటర్నెట్లో బోలెడంత సమాచారాన్ని సేకరించాను. అయితే టూమచ్ ఇన్ఫర్మేషన్ కూడా కాస్త కన్ఫ్యూషన్ను తెచ్చి పెడుతుంది. ముందుగా మేమనుకున్న రూట్ ఇది.
హైదరాబాద్ -డిల్లీ- చండీఘర్-సిమ్లా-కులు-మనాలి-భాక్రానంగల్ డ్యాం-చండీఘర్ -డిల్లీ-హైదరాబాద్
ఆదివారం ఉదయం ఎపి ఎక్స్ ప్రెస్ ఎక్కి డిల్లీకి బయలుదేరడంతో మా ప్రయాణం మొదలైంది.
మొదటి రోజు: రైలు ప్రయాణంతోనే గడిచింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1670కి.మీ. వేసవికాలమే అయినా ఎసి కోచ్ కాబట్టి ప్రయాణం హాయిగానే సాగింది.
రెండవ రోజు: ఉదయం తొమ్మిదిన్నరకు న్యూడిల్లీ చేరుకున్నాం. అక్కడ మా ఆవిడ కొలీగ్ ఒకాయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ట్రావెల్స్ వాళ్ళ వెహికిల్ ను మాట్లాడి పెట్టింది ఆయనే. వాహనాన్ని కూడా వెంట పెట్టుకోచ్చిన ఆయన ముందుగా వాళ్ళ ఆఫీసుకు తీసుకువెళ్ళి మర్యాద చేసి మమ్మల్ని చండీఘర్ కు సాగనంపారు.
డిల్లీ నుంచి చండీఘర్ కు మా ప్రయాణం ఉదయం పదకొండున్నరకు మొదలైంది. మా డ్రైవర్ పేరు తివారి. ఎసి వెయ్యమంటారా అని అడిగాడు. వేస్తే కిలోమీటరుకు మరో రూపాయి అదనంగా ఇవ్వాలి. ఎలాగు వెళ్తోంది చల్లటి ప్రదేశానికి కదా, వద్దులే అన్నాం. డిల్లీ పొలిమేరలకు వచ్చే సరికి వడగాడ్పుల సెగలు మొదలయ్యాయి. హైదరాబాద్ చాలా నయమనిపించింది. నిజానికి మేము హైదరాబాద్ నుంచి బయలుదేరే సమయానికి అక్కడ ఎండలు అదర కొడుతున్నాయి. తప్పించుకుని వెళ్తున్నాం కదా అనుకుంటే ఢిల్లీ ఇంకా ఘోరంగా ఉంది. హైవే మాత్రం సూపర్. స్ట్రైట్ లైన్ మాదిరిగా తిన్నగ్గా , విశాలంగా ఉంది. ఇది ఒకటవ నంబర్ జాతీయ రహదారి. పానిపట్,కురుక్షేత్ర, అంబాల, అమృతసర్ ల మీదుగా వెళ్తుంది.
కురుక్షేత్ర చూస్తారా అడిగాడు తివారి. మా ప్లాన్నింగ్ లో కురుక్షేత్రం, పానిపట్టు ఉన్నాయి కాబట్టి ముందుగా పానిపట్టుచూస్తాం అన్నాం. భారతదేశ చరిత్రలో చాలా ప్రాధాన్యత కలిగిన మూడు యుద్ధాలు జరిగాయి అక్కడ. అయితే ఇప్పుడుఅక్కడ చూసేందుకు ఒక మ్యూజియం తప్ప ఇంకేమీ లేవు అని డ్రైవరు చెప్పడంతో పానిపట్టు సందర్శన కాన్సిల్అయ్యింది. తరువాత కురుక్షేత్రం. మహాభారత యుద్ధ భూమి. గీతాసారం భోధించిన పవిత్ర స్థలం. ఎవరికైనాచూడాలనిపిస్తుంది కదా! డిల్లీ నుంచి కురుక్షేత్రం 166 కిలో మీటర్లు.
(మిగతాది 'కురుక్షేత్ర' శీర్షికతో ఉన్న బ్లాగులో చదవండి)

1, మే 2010, శనివారం
29, ఏప్రిల్ 2010, గురువారం
శ్వాస ధాత్రి

నిన్న టీవి వార్తలు చూస్తుంటే అందులో ఒక మంచి వార్త!
కొంత మంది ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఒక పరికరాన్ని కనిపెట్టారు. దాని పేరు 'శ్వాస ధాత్రి' . బోరుబావుల్లో పడిప్రాణాలు కోల్పోతున్న పిల్లలను సురక్షితంగా బయటకు తీయడానికి ఉపయోగపడే పరికరం. కనీసం బయటకు తీసేంతవరకైనా పిల్లల ప్రాణాలను నిలిపే పరికరం. వారిలో భయాన్ని, ఆందోళనని తొలగించే పరికరం. నీకేం కాలేదు, మేమంతా నీతోనే ఉన్నాం అని ఆ లేత మనసుకు ధైర్యం చెప్పడానికి పనికి వచ్చే పరికరం. ఇంకా ఎన్ని ప్రయోజనాలుఉన్నాయో, అసలు ప్రయోగదశను దాటి క్షేత్ర స్థాయికి వచ్చాక ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తుందో తెలీదు కాని ఇక్కడసంతోషకరమైన విషయం ఏంటంటే ఆ విద్యార్థులు చేసిన ప్రయత్నం, వారి ఆలోచించిన విధానం, లోకం తెలియనివయసులో నానా హింసను అనుభవించి సమాజ నిర్లక్ష్యానికి ఘోరంగా బలయిపోతున్న పసివాళ్ళ కోసం ఏదన్నాచేయాలన్న తపన వారిలో కలగడం. వాళ్ళు కూడా నిన్నా మొన్నటి పసివాళ్ళే. అయినా ఎంత పెద్ద ఆలోచన! సమాజంపట్ల ఎంతటి బాద్యత!
ప్రజాసేవ కోసమే మేమున్నామనే రాజకీయ పెద్దలు, ప్రజల రక్షణకే మేము పని చేస్తున్నామనే రక్షక భటులు, రేపటిపౌరుల మీద ఎక్కడలేని బాద్యతను నెత్తిన ఏసుకుని 'ఆట'ను ఆపమని గగ్గోలు పెట్టె సామాజిక సంస్కర్తలు... వీరెవరికీకలగని స్పందన ఆ విద్యార్థులలో కలగడం హర్షణీయం. ఇదిగో వీళ్ళే.. ఇలాంటి విద్యార్థులే రేపటి సమాజాన్ని నడపబోయేసైనికులు అన్న ఆలోచన రేపటి ఉత్తమ సమాజం పై నాకు ఆసను కలిగిస్తుంది. ఏమో! ఈలోపు ఏ రాజకీయ శక్తి వారినితమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటుందో!..ఏ సిద్ధాంతాలు వారిని పక్కదారి పట్టిస్తాయో !.. ఏ ప్రాంతీయ తత్త్వం, ఏకుల తత్త్వం, ఏ మత తత్త్వం వారిని స్వార్థ పరులుగా మారుస్తుందోనని భయం కూడా ఉంది మరో ప్రక్క. ఏది ఏమైనా వారిప్రయత్నాన్ని హర్షిద్దాం. బ్లాగర్లు అందరూ ఈ విషయంపై మీవంతుగా స్పందించండి.
28, ఏప్రిల్ 2010, బుధవారం
మీడియా మానియా ..పాపం సానియా !
కొన్నాళ్ళ క్రితం ఇదే బ్లాగులో 'ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి' అన్న శీర్షికతో సానియా పెళ్లి విషయంలో మీడియాచూపిస్తున్న అత్యుత్సాహం గురించి రాసాను. పిలవని పేరంటానికి వెళ్లి అవమానాల పాలైనా, సానియా ఇంటి చూరుపట్టుకుని వేలాడి మరీ పెళ్లి ఘట్టాలను క్షణ క్షణం కళ్ళకు కట్టింది మీడియా . మొదట్లో అయాచితంగా వచ్చిన పబ్లిసిటీనికాదనలేక పోయినా కొత్త దంపతులను కాపురం కూడా చేసుకోనివ్వకుండా మీడియా తరుముతుంటే పాపం సానియా జంటఇకనైనా మా మానాన మమ్మల్ని వదలన్డంటూ బతిమిలాడుకోవలసి వచ్చింది. చెప్పించుకునేదాక రావడం అన్నది సిగ్గుపడాల్సిన విషయం కదా. దీన్నే 'అతి' అంటారేమో?
24, ఏప్రిల్ 2010, శనివారం
23, ఏప్రిల్ 2010, శుక్రవారం
ఈ వ్యవస్థలో కులమూ ఒక ఆయుధమే !
అసలు కులం అన్న భావననే రూపుమాపాలని సభ్య సమాజం భావిస్తోంటే సిగ్గులేని, నీతిలేని రాజకీయాలు ఆ కులభావనని స్వార్థ ప్రయోజనాల కోసం పెంచి పోషిస్తున్నాయి. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా, వ్యభిచారం చేస్తూ కెమెరాలకు దొరికినా, అక్రమాలు చేసినా , ఆక్రమణలు చేసినా '. పలానా కులం వాడిని కాబట్టి నామీద కుట్ర చేస్తున్నారు. ఇది అగ్రవర్ణాల అహంకారం.' అని సిగ్గు లేకుండా తప్పును కప్పి పుచ్చుకునేందుకు, దృష్టినిమళ్ళించేందుకు కులాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. రిజర్వేషన్లు గాని, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రాధాన్యత గానిఆయా కులాల్లో ఉన్న పేదలను ఉన్నత స్థితికి తీసుకురాడానికి ఉద్దేశించినవి. అంతే కాని కులపిచ్చిని రెచ్చగొట్టడానికికాదు. కులాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలు చేయడానికి కాదు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నూకారపు సూర్య ప్రకాశ రావు అనే ఆయనపై కొన్నేళ్ళ క్రితం భూ ఆక్రమణలఆరోపణలు వచ్చాయి. వాటినుంచి బయట పడేందుకు కుల ప్రస్తావన తెచ్చి హంగామా చేసాడు. ఆ ఆరోపణలలో నిజంఎంత ఉందో తెలీదు కాని , ఆయనకు మాత్రం ప్రెస్ కు ఎంత పవరు ఉందో బాగా అర్థమైంది . అందుకే ఒక పత్రిక పెట్టేసి తనేఇతరుల అక్రమాల గురించి రాయడం మొదలు పెట్టాడు. అయితే ఇప్పుడు అతని మీద వచ్చిన ఆరోపణలు ఏంటంటే , పత్రికను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిలింగుకు పాల్పడ్డాడని. జర్నలిజం నైతిక విలువలని మంటకలిపాడని. ఈఆరోపణలని అతను న్యాయపరంగా ఎదుర్కోవచ్చు. తన చేతిలోనే పత్రిక ఉంది కాబట్టి అవన్నీ అభూత కల్పనలని సాక్షిపత్రిక తరహాలో వినూత్న కథనాలు రాసుకోవచ్చు. పత్రికలూ కూడా స్వప్రయోజనాలకే అన్న విషయం జనానికి ఎప్పుడోతెలిసింది. ఎవరు ఏం రాసుకున్నా వాళ్ళు అడగరు. ఇవన్నీ కాకుండా ఈ కుల ప్రస్తావన ఎందుకు స్వామీ? నీతి అన్నదిమనిషిని బట్టి ఉంటుంది కాని కులాన్ని బట్టి కాదని పత్రికాధిపతులు తమకు తెలియదా? రాధా కృష్నది అహంకారమేఅనుకుందాం. అతనూ పత్రికను అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదించాడనే అనుకుందాం. నువ్వు చేసింది అక్రమం అంటేఏం నువ్వు చెయ్యలేదా' అని అసెంబ్లీలోనే కాట్లాడు కున్న వ్యవస్థ మనది. న్యూస్ ఛానెలు పెట్టి ఒకడు, పత్రిక పెట్టి ఒకడు,పార్టీ పెట్టి ఒకడు, ఆశ్రమం పెట్టి ఒకడు ..ఇలా అందరూ అక్రమంగా సంపాదించుకోండి. మనది ప్రజాస్వామ్యం మరి. అందుకని మేమేమీ అడగం. కానీ ఈ కులాల వాదం తీసుకురాకండి. దండం పెడతాం.
'

20, ఏప్రిల్ 2010, మంగళవారం
గుర్తుకొస్తున్నావు!
గుర్తుకొస్తున్నావు.
బాగా గుర్తుకొస్తున్నావు.
నిన్ను మర్చిపోవాలనుకున్న కొద్దీ గుర్తుకు వస్తున్నావు.
అసలు గుర్తుకు రావడం ఏంటి? మర్చిపోతేనే కదా గుర్తుకు రావడం అనేది ఉంటుంది. ఇది గుర్తుకు రావడం కాదు. మర్చిపోలేక పోవడం.
'అసలు నన్నెందుకు మర్చిపోవాలి?' అని నువ్వు నన్ను అడిగితే బాగుండు అనిపిస్తుంది. 'నన్ను ప్రేమిస్తున్నావా?' అనిఅడిగితే బాగుండు అనిపిస్తుంది. నువ్వేదీ అడగవు. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు. నీ కోసం నా మనసు పడే బాధ నీకుఅర్థం కాక కాదు. అక్కర లేక. అందుకే విలవిల లాడుతున్న నన్ను చూస్తూ కూర్చుంటావు తప్ప ఏమైందని అడగవు. నేనూ చెప్పను. ఇది అహంకారం కాదు. నీ మీద ప్రేమే. నీకు అక్కరలేని వాటిని నిన్ను బతిమిలాడో, కన్వీన్స్ చేసో నీకుఎందుకు అంటగట్టాలి? నేనేమి సేల్స్ మాన్ని కాదు. ప్రేమికుడిని. నా ప్రేమ నీకు విలువైనదిగా అనిపించాలి. అరుదైనవరంలా అనిపించాలి. నీకు కావాలనిపించే అర్హతలు నేను పొందాలి. అపుడు నువ్వే అడుగుతావు. 'నన్నుప్రేమిస్తున్నావా?' అని.
అవన్నీ జరగాలంటే ముందు నిన్ను మర్చి పోవాలి. అందుకే ఈ ప్రయత్నం. నీకు తెలుసా? ఎవరో ఒక అనుభవశాలి ఇలాచెప్పాడు "సంతోషం అయినా ప్రేమ అయినా - మనం వాటి వెనకాల పరుగేత్తినంత కాలం దొరకవు. మనం ఆదమరపుగా ఉన్నపుడు సీతాకోక చిలుకలా మన భుజం మీదికి వచ్చి వాలతాయి.''
అందుకే నిన్ను నా మనసు దరి దాపుల్లోకి రానివ్వకూడదని అనుకుంటున్నాను. అయినా వదలవుగా నువ్వు. నీముఖంలోకి చూస్తే నన్ను నేను మర్చిపోతాననే భయం. అందుకే నువ్వు నాకు ఎదురు పడకూడదు అనుకుంటాను. నీమాట వింటే మంత్రంలా నా మనసును కట్టిపడేస్తుందని భయం. నీకు దూరంగా ఉంటేనే నీ మాయ లోంచి నాకు విముక్తి. అందుకే ఈ దూరం ఇల్లాగే ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు దగ్గరవ్వాలని అనుకునేదాకా ఈ దూరంకొనసాగాలి. నా ప్రేమ సీతాకోక చిలుకవు నువ్వు. నీ అంతట నువ్వే నా మనసు తోటలోకి వచ్చి వాలాలి. అప్పటికి దాకానీ లోకంలో నువ్వు హాయిగా, స్వేచ్చగా ఉండు. నీ సుఖాన్ని కోరుకోవడం కంటే ప్రేమకు పరమార్థం ఏముంది చెప్పు! నీకోసం తపించడంలో నాకు ఆనందం ఉంది. నీకోసం కలవరించడంలో నాకు మనశ్శాంతి ఉంది. నిన్ను ప్రేమిస్తూ ఉండటం నాకు ఎంతో అదృష్టంగా అనిపిస్తుంది. అసలు నిన్ను కలవడం అన్నది నేను గర్విస్తోన్న విషయం. చూసావా! ఇలా రాస్తూ రాస్తూ మళ్ళీ నీ మాయలో పడి ఎక్కడికో వెళ్లిపోతున్నా. ఇదే ప్రేమ మహిమ. కాదు నీ మహిమ. నువ్వు కలవక పోతే అసలు నాలో ఈ ప్రేమ ఎలా పుట్టేది?

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)