పేజీలు

29, ఏప్రిల్ 2010, గురువారం

శ్వాస ధాత్రి


నిన్న టీవి వార్తలు చూస్తుంటే అందులో ఒక మంచి వార్త!
కొంత మంది ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఒక పరికరాన్ని కనిపెట్టారు. దాని పేరు 'శ్వాస ధాత్రి' . బోరుబావుల్లో పడిప్రాణాలు కోల్పోతున్న పిల్లలను సురక్షితంగా బయటకు తీయడానికి ఉపయోగపడే పరికరం. కనీసం బయటకు తీసేంతవరకైనా పిల్లల ప్రాణాలను నిలిపే పరికరం. వారిలో భయాన్ని, ఆందోళనని తొలగించే పరికరం. నీకేం కాలేదు, మేమంతా నీతోనే ఉన్నాం అని ఆ లేత మనసుకు ధైర్యం చెప్పడానికి పనికి వచ్చే పరికరం. ఇంకా ఎన్ని ప్రయోజనాలుఉన్నాయో, అసలు ప్రయోగదశను దాటి క్షేత్ర స్థాయికి వచ్చాక ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తుందో తెలీదు కాని ఇక్కడసంతోషకరమైన విషయం ఏంటంటే ఆ విద్యార్థులు చేసిన ప్రయత్నం, వారి ఆలోచించిన విధానం, లోకం తెలియనివయసులో నానా హింసను అనుభవించి సమాజ నిర్లక్ష్యానికి ఘోరంగా బలయిపోతున్న పసివాళ్ళ కోసం ఏదన్నాచేయాలన్న తపన వారిలో కలగడం. వాళ్ళు కూడా నిన్నా మొన్నటి పసివాళ్ళే. అయినా ఎంత పెద్ద ఆలోచన! సమాజంపట్ల ఎంతటి బాద్యత!
ప్రజాసేవ కోసమే మేమున్నామనే రాజకీయ పెద్దలు, ప్రజల రక్షణకే మేము పని చేస్తున్నామనే రక్షక భటులు, రేపటిపౌరుల మీద ఎక్కడలేని బాద్యతను నెత్తిన ఏసుకుని 'ఆట'ను ఆపమని గగ్గోలు పెట్టె సామాజిక సంస్కర్తలు... వీరెవరికీకలగని స్పందన ఆ విద్యార్థులలో కలగడం హర్షణీయం. ఇదిగో వీళ్ళే.. ఇలాంటి విద్యార్థులే రేపటి సమాజాన్ని నడపబోయేసైనికులు అన్న ఆలోచన రేపటి ఉత్తమ సమాజం పై నాకు ఆసను కలిగిస్తుంది. ఏమో! ఈలోపు ఏ రాజకీయ శక్తి వారినితమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటుందో!..ఏ సిద్ధాంతాలు వారిని పక్కదారి పట్టిస్తాయో !.. ఏ ప్రాంతీయ తత్త్వం, ఏకుల తత్త్వం, ఏ మత తత్త్వం వారిని స్వార్థ పరులుగా మారుస్తుందోనని భయం కూడా ఉంది మరో ప్రక్క. ఏది ఏమైనా వారిప్రయత్నాన్ని హర్షిద్దాం. బ్లాగర్లు అందరూ ఈ విషయంపై మీవంతుగా స్పందించండి.

1 కామెంట్‌: