పేజీలు

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

ఈ వ్యవస్థలో కులమూ ఒక ఆయుధమే !

అసలు కులం అన్న భావననే రూపుమాపాలని సభ్య సమాజం భావిస్తోంటే సిగ్గులేని, నీతిలేని రాజకీయాలు కులభావనని స్వార్థ ప్రయోజనాల కోసం పెంచి పోషిస్తున్నాయి. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా, వ్యభిచారం చేస్తూ కెమెరాలకు దొరికినా, అక్రమాలు చేసినా , ఆక్రమణలు చేసినా '. పలానా కులం వాడిని కాబట్టి నామీద కుట్ర చేస్తున్నారు. ఇది అగ్రవర్ణాల అహంకారం.' అని సిగ్గు లేకుండా తప్పును కప్పి పుచ్చుకునేందుకు, దృష్టినిమళ్ళించేందుకు కులాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. రిజర్వేషన్లు గాని, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రాధాన్యత గానిఆయా కులాల్లో ఉన్న పేదలను ఉన్నత స్థితికి తీసుకురాడానికి ఉద్దేశించినవి. అంతే కాని కులపిచ్చిని రెచ్చగొట్టడానికికాదు. కులాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలు చేయడానికి కాదు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నూకారపు సూర్య ప్రకాశ రావు అనే ఆయనపై కొన్నేళ్ళ క్రితం భూ ఆక్రమణలఆరోపణలు వచ్చాయి. వాటినుంచి బయట పడేందుకు కుల ప్రస్తావన తెచ్చి హంగామా చేసాడు. ఆరోపణలలో నిజంఎంత ఉందో తెలీదు కాని , ఆయనకు మాత్రం ప్రెస్ కు ఎంత పవరు ఉందో బాగా అర్థమైంది . అందుకే ఒక పత్రిక పెట్టేసి తనేఇతరుల అక్రమాల గురించి రాయడం మొదలు పెట్టాడు. అయితే ఇప్పుడు అతని మీద వచ్చిన ఆరోపణలు ఏంటంటే , పత్రికను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిలింగుకు పాల్పడ్డాడని. జర్నలిజం నైతిక విలువలని మంటకలిపాడని. ఆరోపణలని అతను న్యాయపరంగా ఎదుర్కోవచ్చు. తన చేతిలోనే పత్రిక ఉంది కాబట్టి అవన్నీ అభూత కల్పనలని సాక్షిపత్రిక తరహాలో వినూత్న కథనాలు రాసుకోవచ్చు. పత్రికలూ కూడా స్వప్రయోజనాలకే అన్న విషయం జనానికి ఎప్పుడోతెలిసింది. ఎవరు ఏం రాసుకున్నా వాళ్ళు అడగరు. ఇవన్నీ కాకుండా కుల ప్రస్తావన ఎందుకు స్వామీ? నీతి అన్నదిమనిషిని బట్టి ఉంటుంది కాని కులాన్ని బట్టి కాదని పత్రికాధిపతులు తమకు తెలియదా? రాధా కృష్నది అహంకారమేఅనుకుందాం. అతనూ పత్రికను అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదించాడనే అనుకుందాం. నువ్వు చేసింది అక్రమం అంటేఏం నువ్వు చెయ్యలేదా' అని అసెంబ్లీలోనే కాట్లాడు కున్న వ్యవస్థ మనది. న్యూస్ ఛానెలు పెట్టి ఒకడు, పత్రిక పెట్టి ఒకడు,పార్టీ పెట్టి ఒకడు, ఆశ్రమం పెట్టి ఒకడు ..ఇలా అందరూ అక్రమంగా సంపాదించుకోండి. మనది ప్రజాస్వామ్యం మరి. అందుకని మేమేమీ అడగం. కానీ కులాల వాదం తీసుకురాకండి. దండం పెడతాం.
'

3 కామెంట్‌లు:

  1. నూకారపు సూర్యప్రకాశరావు కొప్పులవెలమ (BC) కులానికి చెందిన వ్యక్తి. అతని కులంవాళ్ళు విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో మాత్రమే కనిపిస్తారు. కోట్లు సంపాదించిన తరువాత ఏ కులం అయితే ఏమిటి? కులం కంటే డబ్బుకే పవర్ ఎక్కువ కదా.

    రిప్లయితొలగించండి
  2. well said sir
    all these paper guys are in the same boat
    Nookarapu has crossed the fine line
    i used to start my paper reading with suryaa everyday but not anymore.
    he degraded the paper below tabloid level.

    రిప్లయితొలగించండి
  3. చెత్త వెధవలు.వీళ్ళందరిని కట్టగట్టి బంగాళాఖాతంలో విసిరేయాలి.అప్పుడు గానీ శని వదిలిపోదు.

    రిప్లయితొలగించండి