పేజీలు

8, డిసెంబర్ 2010, బుధవారం

డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు

'డబ్బు టు పవర్ ఆఫ్ డబ్బు ' అని యండమూరి వీరేంద్రనాథ్ నవల దాదాపు తెలుగు వాళ్ళందరూ చదివే ఉంటారు. నవలనే 'చాలెంజ్' అనే సినిమాగా తీసారు. నవల చదవని వారు కూడా సినిమాను చూసుంటారు. ఎందుకంటేచిరంజీవి సినిమాల్లో అదొక సూపర్ హిట్ సినిమా. అందులో హీరో ద్వారా చట్టబద్దంగా డబ్బు సంపాదించడం ఎలాగోచెప్పారు యండమూరి. తెలియకో లేక కథ పరిమితుల మేరకో కొన్ని పద్ధతుల గురించే ఆయన అందులో ప్రస్తావించారు. కాని ఈరోజు దినపత్రికలు చదువుతుంటే మన రాజకీయ నాయకులకు 'చట్టబద్ధంగా డబ్బు సంపాదించడం ఎలా?' అన్నదాని గురించి తెలిసినన్ని పద్ధతులు మహా మహా రచయితల ఊహలకు కూడా అందవంటే నమ్మి తీరాల్సిందే.

కోట్ల కొద్ది ప్రజాధనం పంచుకుంటుంటే చూస్తూ ఊరుకోడం తప్ప మనం ఎం చేయలేం. ఎందుకంటే అన్నీ చట్టబద్దంగాజరిగే దోపిడీలే. కేసు పెట్టడానికి వీల్లేని కేసులు. అవసరమైతే చట్టాలను కూడా మార్చుకుని మరీ చట్టబద్ధంచేసుకుంటున్న దోపిడీ అది. అందుకే నువ్విన్ని కోట్లు మింగావు అంటే , నువ్విన్ని మింగావు అని ఏకంగా అసెంబ్లీ లోనేకొట్టుకు సచ్చినా ఒక్క కోర్టు కూడా దానిని సుమోటోగా తీసుకోలేక పోయింది. ఒక్క పోలీసు స్టేషన్లో కూడా ప్రజా వాజ్యంనమోదు కాలేదు. అంత దాకా ఎందుకు సాక్షి పత్రిక చట్టబద్ధమైన స్తాపన గురించి పత్రికలన్నీ కథనాలను గుప్పించినానోరెల్లి పెట్టి చదివామే కాని ఎదురు ప్రశ్నించామా? చట్ట బద్దం మరి.

తాజాగా రాజా గారి మీద కేసులు పెట్టమని , నిర్వాకాల మీదా దర్యాప్తులు చేపట్టమని ప్రతిపక్షాల గోల. వాళ్ళకి తెలుసుకేసులు పెట్టినా ఒరిగేది ఏదీ ఉండదని. లాలూ, జయలలిత, మాయావతి, ఇత్యాది రాజకీయ నాయకుల మీద పెట్టినకేసులన్నిటిలోనూ జరిగిందేమిటి? అందరూ నిరపరాధులే. ఎటొచ్చీ ప్రజలే అపరాధులు. ఒక్క నాయకుడి నుంచి కూడామ్రింగిన కోట్లను కక్కించలేని దుర్భలురు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి