పేజీలు

18, డిసెంబర్ 2010, శనివారం

నాగవల్లి కాదు చంద్రముఖి రీమేక్! ఇష్టమైతే చూడొచ్చు.


ఒక సినిమాకు సీక్వెల్ అంటే మొదటిదాని కథ ఎక్కడ ముగిసిందో అక్కడ నుండి మొదలయ్యే మరో కథ. పాత్రలు అన్నీకాకపోయినా కొన్ని మాత్రం రెండో దానిలోనూ ఉండాలి. చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన నాగవల్లి కథ సీక్వెల్కథలాగే ఉంది. ఎటొచ్చీ కథనం మాత్రం చంద్రముఖి సినిమాను ఆర్టిస్టులను మార్చి రీమేక్ చేసినట్టుగా ఉంది. అవే సీన్లు. డైలాగులు కూడా అవే. పాటల ప్లేస్మెంట్ కూడా మక్కీకి మక్కీ.

చంద్రముఖీ కి సీక్వెల్ అనగానే ఆ స్థాయి థ్రిల్ ఉంటుందని వస్తాడు ప్రేక్షకుడు. అంతే కాని అదే సినిమాని మళ్ళీచూడాలనుకోడు. ఇది దర్శకుడు వాసు ఎందుకు తెలుసుకోలేదో తెలీదు. పైగా ఇక్కడ జరిగింది ఏమిటంటే.. అవే సీన్లురిపీట్ అయ్యేసరికి ప్రేక్షకులు ఆర్టిస్టుల పర్ఫార్మేన్సును పోల్చి చూసుకున్నారు. దాంతో వీరంతా తేలిపోయారు. ముఖ్యంగా వెంకటేష్ , అనుష్క. వెంకటాపురం రాజాగా వెంకటేష్ నటన బాగానే ఉన్నా , ఆ పాత్రలో ఉండాల్సినంతక్రౌర్యాన్ని, చంద్రముఖి మీద అతనికున్న విపరీత వ్యామోహాన్నీ చూపించడంలో దర్శకత్వ లోపం కనబడింది. అదేపాత్రలో రజని చూపించిన హావభావాలు అద్భుతం. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాకు ప్రాణం. అలాగే క్లైమాక్స్ లో జ్యోతికరక్తి కట్టించినట్టుగా చేసేందుకు నాగవల్లిలో ఎవరి పెర్ఫార్మేన్సుకు అవకాశం లేకుండా పోయింది. అనుష్కాను మరింతగాఉపయోగించుకుంటే బాగుండేది.

అసలు అంతమంది హీరోయిన్లు అవసరమా అనిపించింది. శ్రద్ధాదాస్ , పూనంకౌర్ లు శుద్ధ వేస్ట్. కమలిని ముఖర్జీ ట్రాక్ ,కథను సాగతీయడానికి తప్ప ముఖ్య కథకు అతక లేదు. రిచా గంగోపాద్యాయ పరవాలేదనిపించింది. ఒక్క ముక్కలోచెప్పాలంటే అనుష్క, రిచాలతోనే కథను రంజింప చేయవచ్చు. పోనీ ఇంతమంది హీరోయిన్లు ఉన్నందువల్ల గ్లామర్కురిసిందా అంటే అదీ లేదు.

వెంకటేష్ గురించి వెళ్ళే వాళ్లకు సినిమా ఒకే . మూడు రకాల గెటప్ లలో విభిన్నంగా కనిపించాడు. సైకియాట్రిస్ట్ , వెంకటాపురం రాజా వారి పాత్రల్లో రజనీతో పోల్చుకోకుండా చూస్తే వెంకీ బాగానే చేసినట్టు. కాకపోతే ప్రతి సీన్లోను కామెడీకాకుండా అవసరమైన చోట్ల అయినా సరే కాస్త సీరియస్ నెస్ మెయింటేన్ చేయాల్సింది.

గ్రాఫిక్స్ బాగున్నాయి. ముఖ్యంగా పాము చాలా సహజంగా కనిపించి సన్నివేశాలను రక్తి కట్టించింది. మానసిక శాస్త్రంలోతీరని, బలమైన కోరికకు సంకేతం పాము. ఇక్కడ ఒక మానసిక సమస్య మొదలు అయ్యిందని చెప్పడానికిఉపయోగించుకున్నారు. హీరోయిన్ రిచా చేత పాత సినిమాలో మాదిరి ఒంటి చేత్తో మంచాన్ని లేపించాలని మంచం దగ్గరషాట్ కూడా తీశారు. అంతలో మనసు మార్చుకుని శాండ్లియర్ సీన్ తీసారు.

అసలు ఈ సినిమాకు నాగవల్లి అన్న టైటిల్ వేస్ట్. ఒకే ఒక డైలాగులో తప్పదన్నట్టు నాగవల్లి అని పిలిపించి టైటిల్ కున్యాయం చేశాం అనిపించారు. నిజానికి ఇది చంద్రముఖి - రెండు.

మొత్తం మీద కుంటుంబం మొత్తం ఏదో ఒక సినిమాకు వెళ్లి టైం పాస్ చేద్దాం అనుకుంటే నాగవల్లికి వెళ్ళొచ్చు. అయితేచంద్రముఖిని ఇంట్లోనే వదిలేసి వెళ్ళండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి