
మనందరికీ తెలుసు - మనం గాలి పీల్చుకుని బ్రతుకుతున్నామని. మనలో చాలా మందికి తెలుసు - మన ప్రాణాధారం ఆక్సిజన్ అని, కొన్ని క్షణాలు అది అందక పోతే ప్రాణం నిలువదని. కాని రోజుకు ఎన్నిసార్లు మనం ఆక్సిజన్ గురించిమాట్లాడుకుంటాం? ఎన్నిసార్లు దానికి కృతజ్ఞతలు చెప్పాం? ఎంతగా దానికి గుర్తింపునిస్తున్నాం? డబ్బు గురించి కలవరించినంతగా ఆక్సిజన్ గురించి తలచుకుంటామా? అలా అని ఆక్సిజన్ అనేది లేదనిగాని, దాని అవసరం లేదనిగాని ఎవరైనా అనగలరా?

