
ప్రేమ కూడా అలాంటిదే. మనసుకు ఆక్సిజన్ లాంటిది. జీవితానికి వెలుగు లాంటిది. తెలిసో తెలీకో దాని ఆధారంగానే మనందరం బ్రతుకుతున్నాం. కాకపోతే దాని ప్రాధాన్యతని గుర్తించడం లేదు అంతే. జీవితంలో ప్రతిక్షణం అవసరమైన ప్రేమను కేవలం టీనేజి వయసుకే పరిమితం చేసి ఆ వయసులో ఉండే ఆకర్షననే ప్రేమ అంటున్నాం. దాని ఆధారంగానే సినిమాలు తీసేస్తున్నాం. ఇంతేనా ప్రేమ గురించి మనం తెలుసుకుంది? జీవితంలో ఏ వయసులో అయినా ప్రేమ గురించి మాట్లాడుకోవచ్చని , ప్రేమకు లోనవడంలో తప్పు లేదని, అది సహజం అనీ ఎంద్కుకు తెలుసుకోం? తీరిక లేకా? తెలీకా?
ప్రేమ ప్రాధాన్యత తెలుసుకుంటే తెలియని ఒంటరితనంతో..ఏదో లోటుతో.. నిస్సారంగా, బ్రతుకును యంత్రంలా నెట్టుకొస్తూ.. తనలో తాను తెలియని అసంతృప్తితో రగిలిపోతూ... మనసులో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసుకునేందుకు ప్రయత్నించే ఒక ఇల్లాలిని అర్థం చేసుకోవచ్చు కదా. టీనేజి వయసులో పక్క దారులు తొక్కే పిల్లల్ని అర్థం చేసుకోవచ్చుకదా. మలివయసులో ప్రాధాన్యతను కోల్పోయి, నిరాదరణకు గురయిన పెద్దవాళ్ళను అర్థం చేసుకోవచ్చు కదా.
ప్రేమ గురించి తెలుసుకుందాం. ప్రేమ గురించి ఆలోచిద్దాం. మన జీవితంలో ప్రేమ ఎక్కడుందో, ఏస్థాయిలో ఉందో తెలుసుకుందాం. ప్రేమను ఇద్దాం. ప్రేమను తీసుకుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి