పేజీలు

11, మార్చి 2010, గురువారం

గీతాంజలి


చాలా రోజుల తర్వాత నిన్న, గీతాంజలి సినిమాను మళ్ళీ చూశాను. ఈనాటికి కూడా దాని ఫీల్ పోలేదు. పాతబడలేదు. సినిమాలో నాకు రెండు అంశాలు బాగా నచ్చుతాయి. ఒకటి మణిరత్నం దర్శకత్వ ప్రతిభ. రెండోది ప్రేమ.

సినిమా మొత్తం పచ్చని ప్రకృతిలో చిత్రీకరించబడింది. అలాంటి పచ్చని పరిసరాల నడుమ మణిరత్నం సృష్టించినవాతావరణం అద్భుతం. వాతావరణంలో కాటికి కాళ్ళు చాపుకున్న ముసలాల్లకి కూడా రొమాంటిక్ ఆలోచనలుకలుగుతాయి. అలాంటిది ఎప్పుడు చస్తారో తెలియని వాళ్ళ మద్య ప్రేమ పుడితే ఆశ్చర్యం ఏముంది! హీరో హీరోయిన్లుప్రేమలో పడేన్తవరకు భావోద్వేగాల నడుమ నడుస్తుంది కథ. భావోద్వేగాలను ప్రభావవంతంగా చూపించేందుకు చాలాసీన్లను వర్షంలో నడిపించారు. వాళ్లిద్దరు ప్రేమలో పడ్డాక ప్రేమ సన్నివేశాలన్నిటిని మంచుతెరల మధ్య చిత్రీకరించారు. స్వభావరీత్యా వర్షంలో వేగం, హడావిడి, సందడి ఉంటాయి. పైగా జడివాన ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. మనసులోనిభావోద్వేగాలు కూడా అంతే. అందుకే ఆయా సన్నివేశాలకు వానను తోడు తీసుకున్నారు. ప్రేమ అన్నది మనసునునెమ్మదిగా కమ్ముకుని, దట్టంగా అలుముకుని, చాలాకాలం తర్వాత ఇంకా నెమ్మదిగా విడివడి పోతుంది.. అచ్చంమంచులా. అందుకే ఆయా సన్నివేశాలను హైలైట్ చేయడంలో బ్యాక్ డ్రాప్ గా వర్షం లేదా మంచు బాగా వర్కవుట్అయ్యాయి. ఏయే సీన్లకు వాతావరణం క్రియేట్ చేయాలో మణిరత్నం కు తెలిసినంతగా మరో దర్శకుడికి తెలీదనేచెప్పాలి. గీతాంజలి సినిమా చూస్తున్నంతసేపు మరో లోకంలో ఉన్న ఫీల్ కలగడానికి ఇదే కారణం. ప్రతి ప్రేక్షకుడికి తనుకూడా వాతావరణంలో ఉండి అలా తడుస్తూనో , వణుకుతూనో పాత్రల మధ్య తిరగాలని అనిపిస్తుంది. దట్ ఈజ్మణిరత్నం!
ఇక రెండోది ప్రేమ సంగతి. మామూలుగా మనసులో కలిగిన ప్రేమను ఒకరితో ఒకరు చెప్పుకోడానికి ఎన్నో ఇన్హిబిషన్స్అడ్డొస్తాయి. పెద్దలు, కుటుంబం, ఆస్తి - అంతస్తులు, రేపటి గురించిన భయం, కులం.. ఇలా భౌతికమైన, మనకు మనంసృష్టించుకున్న లౌకి అంశాలు చాలా మనసుల మధ్యలోకి వచ్చి ఒక మనసును మరో మనసుకు కనబడనీయకుండా చేస్తాయి. కాని సినిమాలో ప్రేమికులు ఇద్దరికీ అలాంటి 'లౌకి' భయాలు ఉండవు. రేపటి గురించి 'జాగ్రత్త'అవసరం రాదు. ఎవరు ఏమనుకున్టారన్న 'మర్యాదలు' అసలు లేవు. ఎలాంటి మొహమాటం లేకుండా ఒకరి ప్రేమనుఒకరు తెలుపుకుంటారు. పంచుకుంటారు. అలా స్వేచ్చగా ప్రేమను అందుకుని అనుభవించే మరోలోకం లోకి తీసుకువెళుతుంది కథ.

అందుకే 'గీతాంజలి' ఒక అద్భుత దృశ్య కావ్యం.

1 కామెంట్‌:

  1. ప్రదీప్ శక్తితో వెకిలి హాస్యం, డిస్కోశాంతితో అనవసరమైన చీప్ కామెడీ ట్రాక్ ఇంత మంచి సినిమాకి మరకల్లాంటివి. కొన్ని సీరియస్ సన్నివేశాలో డైలాగులు కామెడీగా అనిపించినా ('సీతక్కా .. మాట', 'ఏం, ఏం, ఏం, ఏం', etc) మొత్తమ్మీద ఈ సినిమా దృశ్యకావ్యమే. అన్నీ సరిగా కుదిరాయి. సంగీతం గురించి చెప్పనే అక్కర్లేదు.

    రిప్లయితొలగించండి