పేజీలు
20, మార్చి 2010, శనివారం
11, మార్చి 2010, గురువారం
నాతి (రాతి) మనసు
'రాయి మీటితే రాగం పలుకును
రాయికన్న రాయివి నీవు ... కసాయివి నీవు!
ఓ .. హృదయం లేని ప్రియురాలా!
అగ్గివంటి వలపంటించి హాయిగా ఉందామనుకోకు
మనసు నుంచి మనసుకు పాకి తీయని గాయం చేస్తుంది
అది తీరని శాపం అవుతుంది.
ఓ .. హృదయం లేని ప్రియురాలా!'

గీతాంజలి

చాలా రోజుల తర్వాత నిన్న, గీతాంజలి సినిమాను మళ్ళీ చూశాను. ఈనాటికి కూడా దాని ఫీల్ పోలేదు. పాతబడలేదు. ఈ సినిమాలో నాకు రెండు అంశాలు బాగా నచ్చుతాయి. ఒకటి మణిరత్నం దర్శకత్వ ప్రతిభ. రెండోది ప్రేమ.
ఈ సినిమా మొత్తం పచ్చని ప్రకృతిలో చిత్రీకరించబడింది. అలాంటి పచ్చని పరిసరాల నడుమ మణిరత్నం సృష్టించినవాతావరణం అద్భుతం. ఆ వాతావరణంలో కాటికి కాళ్ళు చాపుకున్న ముసలాల్లకి కూడా రొమాంటిక్ ఆలోచనలుకలుగుతాయి. అలాంటిది ఎప్పుడు చస్తారో తెలియని వాళ్ళ మద్య ప్రేమ పుడితే ఆశ్చర్యం ఏముంది! హీరో హీరోయిన్లుప్రేమలో పడేన్తవరకు భావోద్వేగాల నడుమ నడుస్తుంది కథ. ఈ భావోద్వేగాలను ప్రభావవంతంగా చూపించేందుకు చాలాసీన్లను వర్షంలో నడిపించారు. వాళ్లిద్దరు ప్రేమలో పడ్డాక ప్రేమ సన్నివేశాలన్నిటిని మంచుతెరల మధ్య చిత్రీకరించారు. స్వభావరీత్యా వర్షంలో వేగం, హడావిడి, సందడి ఉంటాయి. పైగా జడివాన ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. మనసులోనిభావోద్వేగాలు కూడా అంతే. అందుకే ఆయా సన్నివేశాలకు వానను తోడు తీసుకున్నారు. ప్రేమ అన్నది మనసునునెమ్మదిగా కమ్ముకుని, దట్టంగా అలుముకుని, చాలాకాలం తర్వాత ఇంకా నెమ్మదిగా విడివడి పోతుంది.. అచ్చంమంచులా. అందుకే ఆయా సన్నివేశాలను హైలైట్ చేయడంలో బ్యాక్ డ్రాప్ గా వర్షం లేదా మంచు బాగా వర్కవుట్అయ్యాయి. ఏయే సీన్లకు ఏ వాతావరణం క్రియేట్ చేయాలో మణిరత్నం కు తెలిసినంతగా మరో దర్శకుడికి తెలీదనేచెప్పాలి. గీతాంజలి సినిమా చూస్తున్నంతసేపు మరో లోకంలో ఉన్న ఫీల్ కలగడానికి ఇదే కారణం. ప్రతి ప్రేక్షకుడికి తనుకూడా ఆ వాతావరణంలో ఉండి అలా తడుస్తూనో , వణుకుతూనో ఆ పాత్రల మధ్య తిరగాలని అనిపిస్తుంది. దట్ ఈజ్మణిరత్నం!
ఇక రెండోది ప్రేమ సంగతి. మామూలుగా మనసులో కలిగిన ప్రేమను ఒకరితో ఒకరు చెప్పుకోడానికి ఎన్నో ఇన్హిబిషన్స్అడ్డొస్తాయి. పెద్దలు, కుటుంబం, ఆస్తి - అంతస్తులు, రేపటి గురించిన భయం, కులం.. ఇలా భౌతికమైన, మనకు మనంసృష్టించుకున్న లౌకిక అంశాలు చాలా మనసుల మధ్యలోకి వచ్చి ఒక మనసును మరో మనసుకు కనబడనీయకుండా చేస్తాయి. కాని ఈ సినిమాలో ప్రేమికులు ఇద్దరికీ అలాంటి 'లౌకిక' భయాలు ఉండవు. రేపటి గురించి 'జాగ్రత్త'అవసరం రాదు. ఎవరు ఏమనుకున్టారన్న 'మర్యాదలు' అసలు లేవు. ఎలాంటి మొహమాటం లేకుండా ఒకరి ప్రేమనుఒకరు తెలుపుకుంటారు. పంచుకుంటారు. అలా స్వేచ్చగా ప్రేమను అందుకుని అనుభవించే మరోలోకం లోకి తీసుకువెళుతుంది కథ.
అందుకే 'గీతాంజలి' ఒక అద్భుత దృశ్య కావ్యం.
8, మార్చి 2010, సోమవారం
ఇంటి మహిళను ఉద్ధరిద్దాం!
పొద్దున్నే పేపరు తిరగేస్తోంటే అన్నీ మహిళల గురించిన వార్తలు, కథనాలే. వాటిల్లో ఆడబిడ్డను కని తుప్పల్లో పడేసినతల్లి గురించి, అత్యాచారానికి గురైన యువతీ గురించిన రోజువారీ వార్తలతో పాటు, ఎన్నో ఏళ్ళ తరబడి వార్తల్లోఅవసరమైనప్పుడల్లా నానుతున్న మహిళా బిల్లు గురించిన వార్తలూ ఉన్నాయి. వాటిని చాలా హృద్యంగా ఉత్తమజర్నలిజం ప్రజెంట్ చేయగా , ఉత్తమ పాఠకుడి లెవెల్లో నేను చదువుతున్నాను. ఇంతలో కిచెన్లో వంట చేస్తోన్న మా ఆవిడవచ్చి బస్తాలో ఉన్న బియ్యాన్ని డబ్బాలో పొయ్యమని అడిగింది. పేపరు కూడా ప్రశాంతంగా చదువుకోనివ్వకుండాఏమిటీ అంతరాయం అని లోలోపల విసుక్కుంటూ ఆ పనిచేసి వచ్చాను. అలా కూర్చున్నానో లేదో నీల్లోచ్చాయనిపిలుపు. మళ్ళీ విసుగు. అలా అలా ఒక్కో పని. మళ్ళీ మళ్ళీ విసుగు. ఇంత జరుగుతున్నా మా ఆవిడ కూడా ఒకమహిళే అని, ఆమెకు శుభాకాంక్షలు చెప్పాలని నాకు గుర్తుకు రాలేదు. ఇది నా ఒక్కడి లోపం కాదు. పూర్తిగా మగజాతికి పట్టిన జాడ్యం.
దీన్నే పురుషాహంకారం అంటూ ఆడాళ్ళంతా పేరుపెట్టి పిలుస్తారు. అయితే ఈ అహంకారం, నిర్లక్ష్యం ఇంటి ఇల్లాలి పైనేతప్ప బయటి ఆడవాళ్ళ మీద ఉండదు. బయట ఒక అమ్మాయికి సాయం చేయాల్సి వస్తే మగపున్గవులంతా పోటీపడతారు. అదే సాయం ఇల్లాలికి చేయాల్సి వస్తేనే విసుగు. భార్యను ఆఫీసు దగ్గర దిగబెట్టాలంటే ఆఫీసులో అర్జంటు వర్క్గుర్తుకు వస్తుంది . అదే ఆఫీసులో కొలీగ్ ఎవరన్నాఅమ్మాయి తనకు లిఫ్ట్ ఇమ్మని కోరితే , స్త్రీ జనోద్ధరనే తన పరమధర్మం అన్నట్టు అడుగున్నర విస్తీర్ణంలో ఉన్న బైక్ సీటుపై తనతో పాటు ఆవిడను కూర్చోబెట్టుకుని స్పర్శానుభూతినిపొందుతూ మహిళా సేవ చేస్తారు. తన బాస్ లేడీ అయితే ఆమెను మేడం అంటూ విధేయత ప్రదర్శించడానికి వెనుకాడం. అవసరమైతే నోరారా పొగిడి కాకా పట్టడానికి కూడా జంకం. అదే తన ఇల్లాలి దగ్గరికి వచ్చేసరికి తను ఏమాత్రం ఆధిక్యతప్రదర్శించినా ఒప్పుకోం. ప్రేమించిన అమ్మాయి అయితే సిగ్గు వదలి బ్రతిమిలాడు కుంటాం. అదే అమ్మాయి పెళ్ళయిపెళ్ళాంగా మారితే బ్రతిమిలాడాలంటే అవమానంగా భావిస్తాం. ఎందుకంటే ఇల్లాలు ఏం చేసినా ఇంటిని, మనలను వదిలిఎక్కడికి పోలేదనే చులకన భావం. అందుబాటులో ఉన్న అనురాగంపై నిర్లక్ష్యం.
మహిళ అంటే మన ఇంట్లో ఉన్న భార్య, తల్లి, చెల్లి.. వీళ్ళను గౌరవిద్దాం. మనల్ని మనం గౌరవించుకుందాం! అన్నట్టుచివరికి మా ఆవిడకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పానులెండి. ఇదే ఈ రోజు నేను చేసిన మహిలోద్ధరణ.

2, మార్చి 2010, మంగళవారం
మోసగించువాడు ధన్యుడు సుమతి...!
ప్రతి రోజు మోసగాళ్ళ గురించి విని ముక్కున వేలేసుకోవడం మనకు అలవాటయిపోయింది. తెల్లారి మళ్ళీ మోసపోవడం లేదా మోసం చెయ్యడం షరా మామూలే ! పిల్లి చాతకానిది అయితే ఎలుక తోకేత్తి ఆడుతుంది అని లోకోక్తి. మనం మోసపోయామంటే అది మన తెలివి తక్కువతనం. అవతలివాడి గొప్పతనం. మోసం చేయడం ఎంత ధైర్యంతో కూడుకున్న పని!? ఎంత రిస్క్!? అయినా మోసగాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది అంటే మన చాతకానితనం ఎ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవొచ్చు.
మనలాంటి మరో మనిషి నేను దేవుడిని అంటే మనలాంటి మనిషి దేవుడెలా అవుతాడు? అని ఆలోచించడం కామన్ సెన్స్. అలాంటి కామన్ సెన్స్ లేకుండా మోసపోయి, వాడిని మోసగాడు అనటం ఏం సబబు? ఓటు కోసం నోటు ఇస్తుంటే గెలిస్తే వాడికేంటి లాభం? అని ఆలోచించకుండా ఓటు వేసి నాయకులు మోసంచేశారు అనడం, దేశాన్ని దోచుకు తింటున్నారు అని అక్కసు కక్కడం ఎంత వరకు సమంజసం? వందకు వంద లాభం చూపిస్తా అని అంటే ఎక్కడ నుంచి తెస్తాడు? ఎలా తెస్తాడు? అని ఆలోచించకుండా వాడి చేతిలో లక్షల కష్టార్జితాన్ని ఆశతో పోసేసి వాడు బోర్డు తిప్పెశాక మోసంచేశాడు అనడం న్యాయమా? మన తప్పుల్ని, బలహీనతల్ని, అవివేకాన్ని ప్రశ్నించుకోకుండా ఎదుటివాడిని నిందించడం తప్పు.
కల్కి లాంటి వాళ్ళని నెత్తిన ఎక్కిన్చుకున్నది మనం. మన నాయకులు వెళ్లి వాళ్ళ కాళ్ళ మీద పడ్డారంటే వాళ్ళ ప్రయోజనాలేవో వాళ్ళ కుంటాయి. అది ఆలోచించకుండా వాళ్ళే వచ్చి మోకరిల్లగా లేనిది నేనెంత అనుకోవడం అమాయకత్వం కాదా? మన ఇష్ట పూర్వకంగా ఒకడు మనల్ని దోచుకుంటే అది మోసం. మనల్ని అడక్కుండా, మన ఇష్టం లేకుండా దోచుకుంటే అది దోపిడీ. మోసానికి అనుమతి నిచ్చేది మనం. అందుకని మోసగాల్లని నిందించకండి. ఈ సమాజంలో మోసగించువాడు ధన్యుడు. అది చాతకాని వాడు అసమర్ధుడు. నీకు మోసం చేయడం చాతకాక పొతే పోనీ. కనీసం మోసపోకుండా ఉండు చాలు. అప్పుడు మోసగాళ్ళ సంఖ్యా తగ్గుతుంది.

18, ఫిబ్రవరి 2010, గురువారం
ప్రేమ - ఒక అద్భుత శక్తి
కొన్నేళ్ళ క్రిందట నా జీవితంలో నా అనుభవానికి వచ్చిన సంఘటన !
నేనామెను ప్రేమించాను. కాని ఆ విషయం ఆమెతో చెప్పలేను. కారణం మా స్నేహం చెడిపోతుందేమోనన్న bహయం. 'నిన్ను ప్రేమించాను' అని చెప్పడం ఈ సమాజంలో నేరం ఎందుకు అవుతుందో , అందుకు భయమెందుకో నాకు ఇప్పటికి తెలీలేదు. అది అత్యంత సహజమని ఎందుకు అనుకోరో ! ప్రేమ పేరుతో జరిగే ఇన్ని అనర్థాలకు మూలం ప్రేమ అంటేనే తప్పు అన్న భావన అని నా అభిప్రాయం.
నా అభిప్రాయాలేలా ఉన్నా ప్రేమన్నది ఇద్దరి ఇష్టాలకు, అభిరుచులకు , అభిప్రాయాలకు సంబంధించిన విషయం కాబట్టి , అవతలి వారి ఫీలింగ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే కాబట్టి నా ప్రేమ విషయం తనకు అప్పటికి చెప్పలేదు. ఇలాంటి సందర్భంలో ప్రేమన్నది కాలం పరిష్కరించేదాక వ్యక్తిగత బాధగా మిగిలి ఉంటుంది. లోలోన లావాలా మనసును దహించివేస్తూ ఉంటుంది.
ఆ సమయంలో ఒక రోజు... శ్రీరామ నవమి .
ఆఫీసుకు సెలవిచ్చారు. నేను మాత్రం పని వుండి ఆ రోజు ఆఫీసుకు వచ్చాను. అంతకు ముందు రోజు తను ఆఫీసుకు రాలేదు. అంటే తనను చూసి అప్పటికే ముప్పయి ఆరు గంటలు అయి పోయింది. ప్రేమ ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఎడబాటు ఎంత బాధగా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ రోజు తనని చూడాలని చాలా గాడంగా మనసు కోరుతోంది. కాని ఎలా? తన ఇల్లు ఎక్కడో తెలిసినా వెళ్ళలేను. తను ఆఫీసుకు వచ్చే చాన్స్ లేదు . మరెలా? తనను చూడాలి . ఈరోజే చూడాలి. చూడలేనా? నా ప్రేమకు అంత శక్తి లేదా? తనను నాకు ఎలాగైనా చూపించలేదా? యస్ ! నేను చూడగలను. ఇది నా ప్రేమకు పరీక్ష అనుకున్నాను.
బిల్డింగ్ పైకి వెళ్లాను. తన ఇల్లు ఉన్న వైపుకు తిరిగి మనసులో గట్టిగా 'తనని చూడాలి ' అనుకున్నాను. మళ్లీ మళ్ళీ అనుకున్నాను. కిందికి వచ్చాను. నా కొలీగ్ సినిమాకు వెళ్దామా అన్నాడు. ఆశ్చర్య పోయాను. ఎందుకంటే అంత క్రితం నేను అడిగితే తను రానన్నాడు. ఇంతలో అతని మనసెలా మారిందో తెలీదు.
అక్కడ తన ఇంట్లో...
వాళ్ళ అన్నయ్య సినిమాకు వెళ్దామా అని ఆమెను కొద్దిసేపటి క్రితం అడిగాడు. ఆమె రానని చెప్పింది. అతను తన ఫ్రండ్ దగ్గరికి బయలుదేర పోతుంటే ఆమె వెళ్లి సినిమాకు వెల్దామంది. కాని అప్పటికి సమయం దాటి పోయింది. అయినా వెళ్దామని పట్టుబట్టింది.
ఇక్కడ నా ఫ్రండ్ కూడా పట్టు పట్టాడు. బయలుదేరాం. అప్పుడే నాకనిపించింది. ఈరోజు తనని నేను చూడబోతున్నానని. స్కయ్లేన్ థియేటర్ లో ఒక పాత ఇంగ్లీష్ సినిమాకు వెళ్ళాం . టిక్కట్లు అయిపోయాయి. తిరిగి వచ్చేస్తోంటే ఒకతను వచ్చి రెండు టిక్కట్లు ఉన్నాయి కావాలా అని అడిగాడు. అప్పటికే సినిమా మొదలయ్యి చాలసేపయ్యింది. నా ఫ్రండ్ వద్దన్నాడు. కాని నేనే పట్టు పట్టి తీసుకున్నాను. ఎందుకంటే తను ఈ సినిమాకి వచ్చిందన్న సంకేతాలు నా మనసుకు అందుతున్నాయి. తను లోపలే ఉందని నా నమ్మకం. టికట్లు తీసుకుని లోపలి వెళ్లి కూర్చున్నాం. నా కళ్ళు ఆమెనే వెదుకుతున్నాయి. ఫ్రండ్ అడిగాడు ఏం చూస్తున్నావని? చెబితే నవ్వాడు. ఇంటర్వల్ లో అంతా చూసాను. ఎక్కడా ఆమె కనబడలేదు. కాని నాకు నమ్మకం. తన ఉనికి నాకు తెలుస్తోంది. అయితే ఎక్కడ?
సినిమా పూర్తయ్యింది. అందరూ లేచి వెళ్లి పోతున్నారు. నేను వెదుకుతూనే ఉన్నాను. దాదాపు హాలు మొత్తం ఖాళీ అయ్యే దశలో తను కనిపించింది. ఆరు వరసల అవతల కూర్చుంది ఆమె.
ఇదంతా చదివాక ఇదొక అద్భుతం అని అనిపించక పోవచ్చు. అనుకోకుండా జరిగిన సంఘటనలా అనిపించవచ్చు . కాని ఆ దశలో నాకది అత్భుతంలానే అనిపించింది. ప్రేమకు లేదంటే మనసుకు ఏదో దివ్య శక్తి ఉందనే అనిపించింది. టేలిపతి అంటామే ..అలాంటిది ప్రేమలో కచ్చితంగా వర్కవుట్ అవుతుందని నా నమ్మకం.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)